అనిల్ ఎఫ్‌ 3కి బ్రేక్ పడింది..!

302
anil ravipudi
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్‌ 2. ఫ్యామిలీ,కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించగా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఇక ఈ మూవీ తర్వాత దీనికి సీక్వెల్ ఎఫ్‌ 3 వస్తుందని అనిల్ రావిపూడి ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరవార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎఫ్‌ 3 స్క్రిప్ట్ పై దృష్టిసారించిన అనిల్ ప్రస్తుతం దీనిని పక్కకు పెట్టారట.

కరోనా నేపథక్యంలో ఓ చిన్న సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట అనిల్. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

- Advertisement -