ఎంపీ సంత‌న్న‌ శుభాకాంక్షలు తెలిపిన అనిల్ కూర్మాచలం ..

238
Anil Kuramachalam greeted by MP Santosh Kumar
- Advertisement -

ఇటీవల రాజ్యసభ ఎంపీ గా ఎన్నికైన శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను నేడు ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మర్యాద పూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే లండన్ లోని మొట్టమొదటి తెరాస పార్టీ ఎన్నారై శాఖ ఆవిర్భావం నుండి నేటి వరకు సంతోష్ కుమార్ అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ఉద్య‌మ కాలం నుంచి కేసీఆర్ వెంట న‌డిచి ఆయ‌న‌కు కొండంత అండ‌గా సంత‌న్న ఉన్నార‌ని అనిల్ కూర్మాచలం ఈ సంద‌ర్భంగా కొనియాడారు. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు కేసీఆర్ వెంట న‌డిచి ఎళ్ల‌వేళ‌లా సీఎం కేసీఆర్‌కు కంటికి రెప్ప‌లా కాపాడుకున్నార‌ని గుర్తు చేశారు. స్వ‌రాష్ట్రం ఏర్ప‌డి ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం ఇటు ప్ర‌భుత్వానికి అటు పార్టీకి, వార‌ధిగా సంత‌న్న వ్య‌వ‌హ‌రించార‌ని తెలిపారు. నిత్యం చిరున‌వ్వుతో త‌నకు అప్ప‌గించిన విధులను చిత్త‌శుద్ధితో నిర్వ‌హించ‌డం సంత‌న్న‌కు మాత్ర‌మే సొంత‌మని తెలిపారు.

సంత‌న్న‌ను ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి, అవకాశమిచ్చి, గెలిపించిన గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఈ సంద‌ర్భంగా అనిల్ కూర్మాచలం ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కష్టపడి పనిచేసే సంతోష్ కుమార్ కు మరిన్ని పదవులు దక్కాలని అనిల్ కూర్మాచలం ఆకాంక్షించారు.

- Advertisement -