సూర్య కోసం పవన్‌..

228
Pawan Kalyan to grace Naa Peru Surya ‘Thanks To India’ meet
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తాజాగా నటించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. మే 4న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాగానే వసూళ్లు రాబడుతోంది. గ్లామ‌ర్ బ్యూటీ అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించగా వ‌క్కంతం వంశీ తెర‌కెక్కించించారు. అయితే చిత్రాన్ని ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కి థ్యాంక్స్ చెప్పేందుకు థ్యాక్స్ టూ మీట్ ఇండియా పేరుతో ఈవెంట్ ప్లాన్ చేశారు మేక‌ర్స్‌.

Pawan Kalyan to grace Naa Peru Surya ‘Thanks To India’ meet

మే 10 సాయంత్రం 7గం.లకి ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నాడు. వేదిక ఎక్క‌డ‌నేది తెలియాల్సి ఉంది. అయితే అదే రోజు నేల టిక్కెట్టు ఆడియో వేడుక పీపుల్ ప్లాజాలో జ‌ర‌గ‌నుండ‌గా, ఆ వేడుక‌కి కూడా ప‌వ‌న్ గెస్ట్‌గా హాజ‌ర‌వుతాడు. నా పేరు సూర్య చిత్రం ఆర్మీ నేప‌థ్యంలో సాగే చిత్రం కాగా, ఇందులో బ‌న్నీ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించి అల‌రించాడు. విశాల్‌- శేఖ‌ర్ ద్వ‌యం అందించిన మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

- Advertisement -