కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా

205
Anil Kumble resigns as chief coach of Indian cricket team
- Advertisement -

టీమిండియాలో భారీ సంక్షోభం నెలకొంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే మధ్య విభేదాలను నిజం చేస్తూ కుంబ్లే తన పదవికి రాజీనామా సమర్పించాడు. కొంతకాలంగా కుంబ్లే, కోహ్లి మధ్య తీవ్రస్ధాయిలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వాటిని నిజం చేస్తూ కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేశారు.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీతో అతడి ఏడాది పదవీ కాలం ముగిసింది. వెస్టిండీస్ టూర్‌కు కూడా కోచ్‌గా అనిల్ కుంబ్లేనే కొన‌సాగుతాడ‌ని ఇప్ప‌టికే బీసీసీఐ తేల్చిచెప్పింది.  అయితే మంగ‌ళ‌వారం టీమంతా లండ‌న్ నుంచి విండీస్‌కు వెళ్లినా.. కుంబ్లే మాత్రం అక్క‌డే ఉండిపోయాడు. ఐసీసీ వార్షిక సమావేశాల కారణంగా ఆయన జట్టుతో కలిసి వెళ్లలేకపోతున్నట్టు టీమిండియా వర్గాలు తెలిపాయి. అయితే అంతలోనే  కోచ్ పదవికి కుంబ్లే గుడ్ బై చెప్పేయడం కలకలం రేపుతోంది.

కోహ్లీ, కోచ్‌ కుంబ్లే మధ్య విభేదాలు తలెత్తినట్లు మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. బీసీసీఐ పాలకుల కమిటీ, గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్‌ సలహా సంఘం వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఏ విధమైన ప్రయోజనం లేకపోయింది.

- Advertisement -