భారతీయుడులో విలన్‌గా అనిల్ కపూర్…?

585
shankar anil kapoor
- Advertisement -

లెజండరీ నటుడు కమల్ హాసన్- శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో తమిళం, హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో తెరకెక్కిస్తున్నారు. దాదాపు 22 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మూవీ వస్తుండటంతో తమిళ ఇండస్ట్రీతో పాటు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భారతీయుడు 2 శరవేగంగా తెరకెక్కుతుండగా సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. మూవీలో విలన్‌గా అనిల్ కపూర్‌ నటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. తొలుత ఈ మూవీలో విలన్‌గా అజయ్ దేవగన్‌ని తీసుకోవాలని భావించారు శంకర్. అయితే ఖర్చు ఎక్కువగా అవుతుండటంతో ఈ ఆలోచన విరమించుకున్నారట.

ఈ నేపథ్యంలోనే భారతీయుడు 2 కోసం అనిల్‌ని సంప్రదించారట శంకర్. 20 సంవత్సరాల క్రితం అనిల్ కపూర్…శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నాయక్ ద రియల్ హీరో సినిమాలో నటించారు. తమిళ్‌లో తెరకెక్కిన ముదల్వాన్‌ మూవీకి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. తెలుగులో ఒకే ఒక్కడుగా ఈ మూవీ రిలీజైంది. ఈ నేపథ్యంలోనే అనిల్‌తో చెన్నైలో సంప్రదింపులు జరిపారట శంకర్‌. ఇందుకు సంబంధించి అఫిషియల్ కన్‌ఫర్మేషన్‌ రావాల్సి ఉంది.

ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2లో సిద్దార్థ్,రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్ర పోషిస్తుండగా కాజల్ అగర్వాల్ కీ రోల్ పోషిస్తోంది. నవంబర్‌లో కాజల్ చిత్రయూనిట్‌తో జాయిన్ కానుండగా సిద్దార్థ్ లవర్‌గా రకుల్ నటిస్తోంది.

- Advertisement -