డిజిటల్ మీడియాలోకి ప్రియమణి..!

832
priyamani
- Advertisement -

తెలుగు, తమిళ, మళయాల చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియమణి . ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తన నటనతో పాటు పొదుపైన సొగసైన అందాలతో కుర్రకారు మతిపొగట్టోంది. పెళ్లి అయినప్పటి నుంచి వెండితెరకు దూరమైన ఈ భామ బుల్లితెరపై ప్రస్తుతం హోస్ట్ గా దర్శనమిస్తోంది.

తాజాగా వెబ్ సిరీస్‌తో డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. ద ఫ్యామిలీ మ్యాన్‌తో మనోజ్ బాజ్‌పేయ్‌ కలిసి వెబ్ సిరీస్‌లో నటించింది. అమెజాన్ ప్రైమ్‌ లో ఈ వెబ్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్‌ఐఏ(నేషనన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)…మధ్య తరగతి ప్రజల కోసం సీక్రెట్‌గా ఎలా వర్క్ చేస్తుందనే కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

తన కెరీర్‌ని కొత్తగా మలుచుకునేందుకు డిజిటల్ మీడియాలోకి వచ్చానని ఈ సందర్భంగా వెల్లడించింది ప్రియమణి. తెలుగులో ఎన్టీఆర్‌తో యమదొంగ,జగపతిబాబుతో పెళ్లైన కొత్తలో మూవీలో నటించిన ప్రియమణి తన నటనతో ప్రేక్షకులను థ్రిల్ చేసింది.

- Advertisement -