మొక్కలు నాటిన సీరియల్ నటుడు అనిల్ అల్లం…

594
green india challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటారు సీరియల్ నటుడు అనిల్ అల్లం.మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీరియల్ నటుడు అనిల్ అల్లం అన్నారు.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.దేశ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.కమెడియన్ ఖయ్యుమ్ , సీరియల్ నటి సుమ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో సీరియల్ నటుడు అనిల్ అల్లం మొక్కలు నాటారు.

అనంతరం మరో ముగ్గురు సీరియల్ నటులు ( అంజూ అశ్రాని , రక్షిత , అమృత ) ముగ్గురు కూడా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -