మీరు మీ స్మార్ట్ ఫోన్‌లో పోర్న్ చిత్రాలు చూస్తున్నారా..పోర్న్ సైట్ల కోసం వెతుకుతున్నారా..?ఆ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారా..?అయితే, ఇకపై దీనికి పుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే మీ స్మార్ట్ ఫోన్‌కు మాల్వేర్(సాఫ్ట్ వేర్ వైరస్)తో పెద్ద ముప్పే పొంచి ఉందని అంటున్నారు సైబర్ నిపుణులు.
మీరు డౌన్ లోడ్ చేసుకునే యాప్… ఫోర్న్ వీడియోల ద్యారా వైరస్ మీ ఫోన్ లోకి చేరిపోయి మీ ఫోన్ లోని పర్సనల్ డేటా ను, ఫోటోలను, మెయిల్స్ లను సింపుల్ గా హ్యాక్ చేసేస్తుంది. ఈ విషయంలో అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
పోర్న్ చిత్రాలు చూసేటప్పుడు కనిపించే లింక్స్, వచ్చే టెక్ట్స్ మెసేజెస్‌ను ఓపెన్ చేసినా, క్లిక్ చేసినా ఈ పోర్న్ యాప్‌లు మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ అయ్యే అవకాశముందని, ఒక్కసారి వీటిని తొలగించడం చాలా కష్టమని, ఈ యాప్స్ మీ ఫోన్‌లోని సమస్త సమచారాన్ని ఊడ్చేస్తాయని నిపుణులు అంటున్నారు.
ఇక ఈ మధ్య ఫేస్ బుక్ లో…. “అడల్ట్ ఛాట్” పేరుతో ఉన్న యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా ఒకటే యాడ్స్ కనిపిస్తున్నాయి. అమ్మాయిల ఫోటోలతో టెంప్ట్ చేస్తున్నాయి. సింగిల్ గా ఉన్నారా? బోర్ కొడుతుందా? అయితే ఇక్కడ మాతో ఛాట్ చేయండంటూ కవ్విస్తున్నాయి. అలాంటి యాప్స్ జోలికి పోకపోవడమే ఉత్తమమైన మార్గం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షల ఫోన్ లు హ్యక్ అయినట్టుగా సమాచారం.
అయితే, ఇలాంటి యాప్స్ గుర్తించడం ప్రస్తుతం చాలా సులభమని నిపుణులు చెబుతున్నారు. పోర్న్ సంబంధిత యాప్స్‌లోనే ఇలాంటి ముప్పు ఎక్కువగా ఉందని, ఇలాంటి యాప్స్ పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేటివ్ రైట్స్‌ను కోరుతాయని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. కిట్‌కాట్ 4.4, అంతకుపూర్వం అండ్రాయిడ్ వెర్షన్ మొబైల్ ఫోన్లలో ఈ ముప్పు మరింత అధికమని సైబర్ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.