క్యూలు పెరిగాయి…అష్టకష్టాల్లో జనం

239
currency problems continue
- Advertisement -

రెండో శనివారం, ఆదివారం, మిలాద్ ఉన్ నబీ కారణంగా… వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. వరుసగా మూడు రోజులు వరుస సెలవులు రావడంతో జనాలకు చుక్కలు కనిపించాయి.. చాలా ఏటీఎం లలో డబ్బులేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు…మూడు రోజుల సెలవుల అనంతరం బ్యాంకులు మంగళవారం తెరుచుకున్నాయి. ఉదయం నుండే బ్యాంకుల ముందు ఉదయం నుంచే భారీ క్యూలు దర్శనమివ్వనున్నాయి.అయితే, పరిస్థితిలో ఏమాత్రం మార్పురాలేదు. పలు ఏటీఎంల ముందు అవుట్‌ ఆఫ్‌ సర్వీస్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

మరోవైపు ఎంతకష్టమైన పర్వాలేదని గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్నా..తమ దగ్గరకొచ్చే సరికి ATM సెంటర్లో డబ్బులు అయిపోతుండటంతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఎకౌంట్లో డబ్బులు ఉండి కూడా…తీసుకోలేని పరిస్థితి. దీంతో కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. సామన్య ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే డబ్బులు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 currency problems continue

ఒకప్పుడు ఎరువుల కోసం క్యూలైన్లలో ప్రజలు చెప్పులు లేదా తమవెంట తెచ్చుకున్న వస్తువులను ఉంచేవారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడలేక…చెప్పులను ఏటీఎం ముందు ఉంచుతున్నారు.

ఓ వైపు సామాన్య ప్రజలకు ఒక్క నోటు దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. అధికారుల దాడుల్లో బడా బాబుల వద్ద కోట్లాది రూపాయల కొత్త నోట్లు దొరుకుతుండటంతో నోట్ల రద్దుపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. నోట్ల కష్టాలు తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వ పెద్దల మాటలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

 currency problems continue

పెద్ద నోట్లు రద్దు చేసి ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. నాగపూర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన చిదంబరం నోట్ల రద్దు పెద్ద కుంభకోణమని మండిపడ్డారు. దినిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు విషయం ముందే లీక్‌ అయిందని ఆరోపించారు.ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిగా నగదు రహిత లావాదేవీలు లేవన్నారు.నోట్ల రద్దు వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లింది. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు

కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకున్నదని, నోట్ల రద్దును ప్రముఖ ఆర్థికవేత్తలు, ప్రధాన దినపత్రికలు ఖండిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తు వల్ల కూడా ఇంత నష్టం ఉండదన్నారు. డిమాండ్ లేకపోవడం వల్ల ద్రవ్యోల్బణం పడిపోయింది, అంతేకాకుండా డిమాండ్ లేకపోవడం వల్లే వస్తు ఉత్పత్తి కూడా తగ్గిందని దుయ్యబట్టారు.

- Advertisement -