ఏపీలో ఫస్ట్ జగన్..లాస్ట్ ఎవరో తెలుసా?

260
YS Jagan Mohan Reddy
- Advertisement -

ఏపీలో ఉత్కంఠ భరితంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడిన సంగతి తెలిసిందే. ఈఎన్నికల్లో వైసిపి పార్టీ భారీ విజయాన్ని సాధించింది. 151అసెంబ్లీ స్ధానాలు, 22 పార్లమెంట్ స్ధానాలు సాధించి ఆంధ్రరాష్ట్ర చరిత్రలో నిలిచిపోయింది. అధికార టీడీపీ పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితం కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.. ఏపీలో చాలా వరకూ మంత్రులు ఓడిపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన వాళ్లో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 90,110ఓట్లతో టీడీపీ అభ్యర్ధి సతీష్ రెడ్డిపై గెలుపొందారు.

ఇక జగన్ తర్వాత అన్నా రాంబాబు(81,035) మెజార్టీతో సెకండ్ ప్లేస్ లో ఉండగా, కిల్లివెటి సంజీవయ్య(61,292)మూడవ స్ధానం , సూర్య నారాయణ రెడ్డి(55,207)నాల్గవ స్ధానంలో ఉన్నారు. ఇక అత్యల్ప మెజారీటి సాధించిన వారిలో మొదటగా విజయవాడ సెంట్రల్ వైసిపి అభ్యర్ది మల్లాది విష్ణు కేవలం 23 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.

టీడీపీ తరపున మాజీ మంత్రి బోండా ఉమపై ఆయన గెలుపొందారు. ఆయన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి 708ఓట్లతో విజయం సాధించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు వచ్చిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి 3,80,976 ఓట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇక చివరగా గుంటూరు నుంచి ఎంపీగా మరోసారి గెలుపోందిన గల్లా జయదేవ్ ఉన్నారు. ఈయన 4,205 మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి మోదుగులపై విజయం సాధించారు.

- Advertisement -