సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు

258
Raghuveera-Reddy Kcr
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు లేఖ రాశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. యూపిఏ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీ కి మద్దతుపలకవద్దని లేఖలో పేర్కొన్నారు.

అలాగే పలు రాజకీయ అంశాలపై రఘువీరారెడ్డి లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు కూడా మద్దతు తెలపాలని కోరారు. ఓ వైపు తెలంగానలో టీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య తీవ్రమైన ఫైట్ నడుస్తుండంతో ..ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈవిషయంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -