వెన్నుపోటు పొడవడంలో బాబు సీనియర్ః ప్రధాని మోదీ

217
modi
- Advertisement -

వెన్నుపోటు పొడవడంలో ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ అన్నారు ప్రధాని మోదీ. చంద్రబాబు ఏపీ అభివృద్దిని వదిలేసి తన కొడుకు అభివృద్దికి కోసం కష్టపడుతున్నారన్నారు. గుంటూరులో బీజేపీ నిర్వహించిన ప్రజా చైతన్య వేదిక సభలో ప్రధానమంత్రి మోడీ పాల్గోన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాకూటమి కలయిక అపవిత్ర కలయిక అని విమర్శించారు. మొదట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షాలు తెలిపారు. ఎంతో మంది ప్రముఖులు ఈగుంటూరు జిల్లా నుంచి వచ్చిన వారేనని చెప్పారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కు గుంటూరు కేంద్రం కానుందని దేశానికే ఏపీ ఆదర్శంగా నిలవబోతోందని చెప్పారు.

అందుకే వేలాది కోట్ల విలువైన పెట్రోలియం మౌలిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామన్నారు. దీనివల్ల ఇంధన రంగంలో దేశానికి భద్రత లభిస్తుందని పేర్కొన్నారు. అమరావతిని గతంలో ఆంధ్రా ఆక్స్ ఫర్డ్ గా అభివర్ణించేవారని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడకు వచ్చేవారని తెలిపారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సభా స్థలి నుంచే రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రూ.7,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఓఎన్‌జీసీ, ప్రెటోలియం శాఖ అనుబంధ సంస్థ చేపట్టిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చారు. మరో రూ.2,280 కోట్లతో బీపీసీఎల్‌ సంస్థ కృష్ణపట్నం పోర్టులో కోస్టల్‌ టర్మినల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

- Advertisement -