ఏపీలో మంత్రి విస్తరణ ఆదివారం జరిగింది. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలోని ప్రజావేదికలో వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త మంత్రులుగా ఎన్ఎమ్డీ ఫరూక్, కిడారి శ్రావణ్ కుమార్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఇటివలే మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావును హత్య చేసిన విషయం తెలిసిందే.
ఆయన కుమారుడైన కిడారి శ్రవన్ ను మంత్రి పదవి దక్కడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిడారి శ్రవణ్ కుమార్ కు చట్టసభల్లో సభ్యత్వం లేకుండానే మంత్రిగా అవకాశం దక్కింది. చట్టసభల్లో సభ్యత్వం లేకుండా మంత్రి పదవి దక్కిన వారిలో శ్రవణ్ రెండవ ప్లేస్ లో ఉన్నాడు. శ్రవణ్ వారణాశి ఐఐటీలో మెటలార్జీ పూర్తి చేసి,సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు.మైనార్టీ సంక్షేమం, వైద్యా ఆరోగ్యశాఖను ఫరూక్ కు, గిరిజన సంక్షేమ శాఖను శ్రవణ్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది.