12న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్‌..

240
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తెర‌కెక్కుతున్న‌ చిత్రం క‌వ‌చం. ఈ చిత్ర టీజ‌ర్ న‌వంబ‌ర్ 12న విడుద‌ల కానుంది. దీవాళికి విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు బెల్లంకొండ శ్రీ‌నివాస్. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ళ ఈ థ్రిల్ల‌ర్‌ను తెర‌కెక్కిస్తున్నారు. మెహ్రీన్ కౌర్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Kavacham

ఇప్ప‌టికే క‌వ‌చం షూటింగ్ పూర్త‌యింది.. కేవ‌లం పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ సొంటినేని(నాని) క‌వచం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రాణే, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ‌.. సాంకేతిక నిపుణులు: ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్ ,నిర్మాత‌: న‌వీన్ సొంటినేని,నిర్మాణ సంస్థ‌: వ‌ంశ‌ధార క్రియేష‌న్స్, స‌హ నిర్మాత‌: చాగంటి సంత‌య్య, సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్, సినిమాటోగ్ర‌ఫర్: ఛోటా కే నాయుడు ,ఎడిట‌ర్: ఛోటా కే ప్ర‌సాద్, ఆర్ట్ డైరెక్ట‌ర్: చిన్నా, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్.

- Advertisement -