బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో మొక్కలు నాటే ఆవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ హరితహారంలో పాల్గొనాలని హరితభారతావనని నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దండుగుల రామకృష్ణ, సోషల్ మీడియా మోహన్ నాయక్, ముప్పురి కుమార్, వనిల్ కుమార్ , రజిని కుమార్ , రవి చంద్రశేఖర్ , తోట సత్యనారాయణ, తోట అనిరుద్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: ఎన్టీఆర్ వారసుడు.. కేసిఆరే !