ఏపీలో 16 వేలకు చేరిన కరోనా కేసులు…

37
coronavirus

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇవాళ రికార్డు స్ధాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 845 పాజిటివ్ కేసులు రాగా 5గురు మృతిచెందారు.

గత 24 గంటల్లో 14285 మంది పరీక్షించామని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో విదేశాల నుండి వచ్చిన వారు 4 గురు ఉండగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు 29 మంది ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో 8586 యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉండగా 7313 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 198 మంది మృత్యువాతపడ్డారు.