రివ్యూ : అంధగాడు

347
Andagadu movie Review
- Advertisement -

ఉయ్యాల జంపాల చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించి సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి విజయాలతో హీరో రాజ్ తరుణ్ టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. డిఫరెంట్ కామెడీ ఎంటర్ టైనర్స్‌తో వరుస విజయాలను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్‌ తాజాగా గుడ్డివాడిగా నటించిన చిత్రం అంధగాడు. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ లవ్, రొమాంటిక్, కామెడీ, థ్రిల్లర్ మూవీతో ఏ మేరకు మెప్పించాడో చూద్దాం.

కథ:

గౌతమ్‌ (రాజ్‌ తరుణ్‌)కి కళ్లు కనిపించవు. పుట్టుకతోనే అంధుడు. ఓ అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడవుతాడు. రేడియో జాకీగా స్థిరపడతాడు. నేత్ర (హెబ్బా పటేల్‌) అనే ఓ డాక్టర్‌తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. నేత్ర ఎక్కడ దూరం అవుతుందో అనే భయంతో… తనకు చూపు ఉన్నట్టు నటిస్తాడు. కానీ… నేత్రకు నిజం తెలిసిపోతుంది. స్వతహాగా తానో నేత్ర వైద్యురాలు కావడంతో గౌతమ్‌కి కళ్లొచ్చే ఏర్పాటు చేస్తుంది. కళ్లొచ్చాక అంతా హ్యాపీనే అనుకొంటుంటే.. అప్పటి నుంచే కొత్త సమస్యలు మొదలవుతాయి.  ఆ సమస్యల నుంచి గౌతమ్ ఎలా బయటపడ్డాడు..?గౌతమ్, నేత్రల ప్రేమ కథ ఎలా సుఖాంతమవుతుందో తెరమీద చూడాల్సిందే..

Andagadu movie Review
ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్  కథ, కథనం, స్క్రీన్ ప్లే, కామెడీ, రాజ్ తరుణ్‌ నటన, క్లైమాక్స్.  తనదైన నటన, కామెడీ టైమింగ్‌తో రాజ్ తరుణ్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లోను మెప్పించాడు. కళ్లులేనప్పుడు, కళ్లొచ్చిన తర్వాత.. తన బాడీ లాంగ్వేజ్‌ మారిపోతుంది. మాట తీరు కూడా. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నాడనిపిస్తుంది. హెబ్బా అందంగా కనిపించింది. రాజ్ తరుణ్‌కు పర్ఫెక్ట్‌ జోడిగా మరోసారి ప్రూవ్ చేసుకుంది. రాజేంద్రప్రసాద్ కామెడీ టైమింగ్ సినిమాకు మరో ప్లస్. విలన్ పాత్రలో రాజా రవీంద్ర ఆకట్టుకోగా ఇతర పాత్రల్లో  శియాజీ షిండే, అశిష్ విద్యార్ధి,సత్య పరిధిమేరకు నటించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్ లెంగ్త్, ప్రీ క్లైమాక్స్‌కు ముందు బోరింగ్ సన్నివేశాలు, పాటలు, నేపథ్య సంగీతం.రచయితగా చాలా అనుభవం ఉన్న వెలిగొండ శ్రీనివాస్ మొదటిసారి మెగా ఫోన్ చేతబట్టాడు. బరువైన కథకు కామెడీ, కమర్షియల్ హంగులు జోడించి హిట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే కథనం విషయంలో సరిగా దృష్టి పెట్టకపోవడం, చాలా వరకు సీన్లను చుట్టేశారనే విధంగా చిత్రీకరించడం ప్రధానమైన లోపం. రాజేంద్ర ప్రసాద్, ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే లాంటి ఆర్టిస్టులను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడనే భావన ఏర్పడుతుంది.

Andagadu movie Review
సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. రచయితగా రాణించిన వెలిగొండ శ్రీనివాస్ తాను దర్శకుడిగా మారేందుకు సరైన కథనే ఎంచుకొన్నారు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌తోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. ఫస్టా ఫ్‌లో కామెడీతో ఆకట్టుకున్న శ్రీనివాస్ ప్రీ క్లైమాక్స్ లో కాస్త తడబడ్డాడు. పాటలు ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కూడా అంతే. కెమెరా వర్క్‌ ఆకట్టుకుంటుంది. మాటలు అక్కడక్కడ బాగా పేలాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్ధాయిని పెంచాయి.

తీర్పు :

ఇలాంటి కథాంశంతో వచ్చిన సినిమాలు తెలుగు తెరపై కొత్తమీ కాదు. అయితే ఈ పాయింట్‌ని దర్శకుడు శ్రీనివాస్ డీల్‌ చేసిన విధానం, కథనాన్ని నడిపించిన తీరు.. అందులోని మలుపులు తప్పకుండా రక్తి కట్టించి ఇదో కొత్త తరహా సినిమా అనే భావన కలిగిస్తాయి. ఫస్టా ఫ్‌  వరకూ ఎలాంటి ఉత్కంఠ లేకపోయినా, కాలక్షేపానికి ఢోకా ఉండదు. సెకండాఫ్‌లోనే అసలు కథ మొదలవుతుంది. ఆత్మ.. పగ, నాటకీయత ఇవన్నీ అక్కడే కనిపిస్తాయి. కథకు కీలకమైన ఈ భాగాన్ని దర్శకుడు నడిపించిన విధానం ఆకట్టుకొంటుంది.  మొత్తంగా అంధగాడుతో రాజ్‌ తరుణ్‌ మరోసారి అలరించాడు.

Andagadu movie Review
విడుదల తేదీ:02/06/2017
రేటింగ్: 2.75/5
నటీనటులు: రాజ్‌తరుణ్‌,హెబ్బా పటేల్
సంగీతం: శేఖర్‌ చంద్ర
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
రచన, దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్‌

- Advertisement -