యాంకర్ విష్ణు ప్రియ ఈ మధ్య బోల్డ్ నెస్ ను విచ్చలవిడిగా పెంచేసింది. బుల్లితెరపై యాంకర్ గా సత్తా చాటిన విష్ణు ప్రియ ప్రస్తుతం సినిమాల పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ విష్ణు ప్రియ అడుగు పెట్టాలని సన్నాహాలు చేసుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతూ.. ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. ముఖ్యంగా పర్సనల్ విషయాల పై విష్ణు ప్రియ స్పందించింది.
‘ఈ మధ్య నేను ఎక్కువగా నా పెళ్లి పై చాలా కామెంట్లు వింటున్నాను. నిజం చెప్పాలంటే.. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి నాకు కావాల్సినంత టైమ్ ఉండదు. ఎందుకంటే, నేను ఫ్రీగా ఉన్న సమయంలో నాతో నేను ఉండటానికి ఇష్టపడతాను. మనం మనతో ఎంతో స్వచ్ఛంగా ఉంటాము’ అని విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది. అలాగే విష్ణు ప్రియ తన సంపాదన గురించి కామెంట్స్ చేసింది.
చాలామంది విష్ణు ప్రియ కోట్లు సంపాదిస్తున్నట్లు అనుకుంటారు. కానీ, నేను మాత్రం కోట్లల్లో సంపాదించడం లేదు. నేను అన్ని సినిమాలు డబ్బు కోసమే చేయను. గుడ్ వీల్ కోసం కూడా చేస్తుంటాను. అన్నింటి కంటే ఇంపార్టెంట్, నేను ఏదైనా వర్క్ ఒప్పుకుంటే నాతో పాటు చాలా మందికి ఇన్ కమ్ ఉంటుంది. ఈ విష్ణు ప్రియనే నమ్ముకుని నలుగురు ఉన్నారు. వారి సంపాదన కూడా నా పైనే ఆధారపడి ఉంది అందుకే కొన్ని ఇష్టం లేకపోయినా నేను ఒప్పుకుంటాను అంటూ యాంకర్ విష్ణు ప్రియ మొహమాటం లేకుండా చెప్పింది.
ఇవి కూడా చదవండి..