- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు మొక్కలు నాటారు యాంకర్ వింద్యా.పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత అని యాంకర్ వింధ్యా అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒక బాధ్యత గా మొక్కలు నాటినందుకు గర్వంగా ఉందని అన్నారు.
యాంకర్ రవి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ రామానాయుడు స్టూడియో లో మూడు మొక్కలు నాటింది.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అనంతరం తాను ట్విట్టర్ వేదిక ద్వారా మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతానని యాంకర్ వింధ్యా తెలిపారు.
- Advertisement -