ఉదయభాను రీఎంట్రీ.. సెటైర్లు.. సెటైర్లేనండీ !!

258
Anchor Udaya Bhanu re entry
- Advertisement -

ఉదయభాను యాంకరింగ్ చేస్తూ స్టేజ్ పై ఉంటే ఏ రేంజ్ హంగామా చేస్తుందో తెలిసిన విషయమే. టీవీల్లోనూ.. స్టేజ్ లపైనా ఓ రేంజ్ లో అల్లరి చేసి మెప్పించచ్చని తెలియచెప్పింది ఈమే. ఇప్పుడు హాట్ హాట్ యాంకర్లు అంటే అనసూయ, రష్మి అంటే ఉన్నారు కానీ.. ఇటువంటి ట్రెండ్ ను బుల్లి తెరపై సెట్ చేసింది మాత్రం కచ్చితంగా యాంకర్ ఉదయ భాను… ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను.. నక్షత్రం ఆడియో వేడుకలో ఇతర యాంకర్లకు నక్షత్రాలు చూపిస్తానంటూ మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఒకొక్కసారి రావడం లేటవ్వచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా’ అంటూ సహ యాంకర్ చేసిన స్వాగత వ్యాఖ్యానంతో వేదికపైకి వచ్చింది ఉదయభాను.

udaya

ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. కృష్ణవంశీ నక్షత్రం.. పోలీస్ గురించే కదా.. పోలీస్‌కి ఎప్పుడూ సలాం కొట్టడమే కాదండీ.. పోలీసుకు సర్వీస్ చేయడం తెలుసు. సెల్యూట్ చేయడం తెలుసు. బట్.. ఎన్ని సెటైర్లు వారు అనుభవిస్తారంటే.. ఎంత సర్వీస్ చేసినా వారి లైఫంతా సెటైర్లు.. సెటైర్లు.. సెటైర్లేనండీ. నిజమే కదా?.. ఒక చిన్న పిల్ల తప్పిపోయిందంటే పోలీస్‌నే నిందిస్తారు. ఏదైనా దొంగతనం జరిగిందంటే పోలీస్‌నే నిందిస్తారు. పెద్దతప్పయినా, చిన్న తప్పయినా.. పోలీస్ తప్పంటారు. పోలీస్ సరిగా లేరు.. అదీ ఇదీ అంటారండీ. ఆఖరికి పోలీస్ మీద ధర్నా చేస్తారు కూడా.

Udayabhanu at nakshatram audio

ఆ ధర్నా చేసినా కూడా పోలీసేనండి వారికి బందోబస్తు పెట్టేది. ఆఖరికి వాళ్లకు కాపలా ఉండేది కూడా మన పోలీసే. సో.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు నిజంగా సెల్యూట్ చేశాలి. ఎందుకంటే ఎప్పుడు వెళ్తారో తెలీదు.. ఎప్పుడు వస్తారో తెలీదు. అసలు వస్తారో, రారో కూడా తెలీదు. అలా సెల్ఫ్‌లెస్‌గా సర్వీస్ చేస్తూ.. నిజం చెప్పాలంటే నక్షత్రాలను భుజాన మోస్తూ ఆ ఆకాశం ఎంత ప్రైడ్‌గా ఉంటుందో అంత ప్రైడ్‌గా ఉండే పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను సెల్యూట్ చేస్తూ ఈ సినిమా రాబోతోందండీ.’’ అంటూ సుదీర్ఘమైన డైలాగ్ చెప్పినట్టు చెప్పి మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా స్పీచ్ ఇచ్చేసింది ఉదయభాను…

- Advertisement -