మంత్రి కేటీఆర్‌ను కలిసిన యాంకర్ సుమ..

22
suma

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమె షోస్‌తో ప్రతీ ఇంటి మనిషిగా మారిపోయింది. సుమ అక్కగా అందరికీ పరిచయమే. 6 నుంచి 60 వరకు కూడా అంతా అక్క అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు. అమె ఇష్టపడని వారుండరు. ఇక అసలు విషయానికొస్తే.. తాజాగా యంకర్‌ సుమ తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

కేటీఆర్‌తో మాట్లాడడం పట్ల సంతోషంగా ఉందని సుమ తెలిపింది. తన షోల్లో తాను ఏదేదో మాట్లాడేస్తుంటానని, కానీ, గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న కేటీఆర్.. తాజాగా తాను చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్నారని చెప్పింది. ప్రకటనలు చేస్తూ, వాటిపై నిబద్ధతతో పనిచేస్తూ, అమలు చేస్తూ వెళ్లే మార్గంలో ఆయన పయనిస్తున్నారని సుమ ట్విట్లర్‌లో పేర్కొన్నారు. అయితే, తాను కేటీఆర్‌తో ఏ విషయంపై చర్చించానన్న విషయాన్ని మాత్రం సుమ ప్రకటించలేదు. కేటీఆర్‌తో భేటీ అయిన సందర్భంగా తీసుకన్న ఫొటోను ఆమె పోస్ట్ చేసింది.