GHMC ఎన్నికలు: TRSకు మద్దతిచ్చిన నటుడు పోసాని..

151
posani
- Advertisement -

కేసీఆర్ హయాంలో హిందూ, ముస్లింలు మత సామరస్యంతో ఉంటున్నారని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో దర్శకుడు శంకర్‌తో కలిసి పోసాని శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్‌కు తన మద్దతు ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని హైదరాబాద్ నగరవాసులను పోసాని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థిని మేయర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

35 ఏళ్ల నుంచి తాను ఎంతో మంది నాయకులను, ముఖ్యమంత్రులను చూశానని… కానీ, ఎన్టీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో మత ఘర్షణలు తగ్గాయని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. నగర ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే అది కేసీఆర్ వల్లే అని అన్నారు. నగరాభివృద్ధి కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు.

తెలంగాణ వచ్చాక ఏపీ ప్రజలపై ఎలాంటి దాడులు జరగలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డల మాదిరిగానే ఏపీ వారిని కేసీఆర్ క్షేమంగా చూస్తున్నారని పోసాని కొనియాడారు. హైదరాబాద్‌లో వందేళ్లలో ఎప్పుడూ రానంత స్థాయిలో వరదలు వచ్చాయని.. అందుకే ప్రజలు ఇబ్బందిపడ్డారని పోసాని అన్నారు. ఆ స్థాయిలో వరదలు వస్తే వందమంది కేసీఆర్‌లు ఉన్నా ఏమీ చేయలేరని అన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో వరద బాధితులకు సాయం అందించారు. ఆంధ్రా ప్రజలపై కేసీఆర్‌కు ఏమాత్రం కోపం లేదని, కేవలం దోచుకున్న వారిపైనే కోపంతో ఉన్నారని వెల్లడించారు.

- Advertisement -