బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ శ్రీముఖి. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. కాగా ఇటివలే శ్రీముఖి ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అందులో భాగంగా తన లవ్ గురించి కొన్ని విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంది. దీంతో శ్రీముఖికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ఈ పుకార్లపై స్పందించింది యాంకర్ శ్రీముఖి.
తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, లవ్‌లో ఉందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది. భూత, వర్తమాన కాలాలకు చాలా తేడా ఉంటుంది. గతంలో లవ్‌లో ఉన్నాను.. ఇప్పుడు లవ్‌లో ఉన్నాను అనే వ్యాఖ్యలకు చాలా తేడా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న వీడియో చేసినందుకు చాలా వార్తలు వచ్చాయి’ అని తెలిపింది. నా ఫ్రెండ్స్ కొన్ని ఆర్టికల్స్ చూసి నాకు ఫోన్ చేసి చెబుతున్నారు. వెబ్ సైట్ వాళ్లు కొంచెం తెలుసుకుని రాస్తే మికు కూడా మంచి రేటింగ్ వస్తుందని తెలిపింది.