కౌశల్ ను ఫాలో అవుతున్న శ్రీముఖి..సోషల్ మీడియాలో శ్రీముఖి ఆర్మీ హల్ చల్

547
Srrmukhi
- Advertisement -

బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ షో తెలుగులో విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకుని విజయవంతంగా మూడవ సీజన్లోకి అడుగుపెడుతుంది. త్వరలోనే బిగ్ బాస్ 3 ప్రారంభంకాబోతుంది. ఇందుకు సంబంధించి పలు ప్రోమోలు కూడా విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఈషో పార్టిసిపెంట్ చేయబోయే కంటెస్టెంట్ పేర్లు మాత్రం కొంత మందివి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sreemukhi-Latest-Photos-03

అందులో మొదటగా యాంకర్ శ్రీముఖి. అయితే శ్రీముఖి తన ప్రమెషన్స్ ను అప్పడే మొదలెట్టేసింది. ఈ షో ప్రారంభంకాకముందే తనకు సపోర్ట్ చేయాలంటూ తన మిత్రులతో కలిసి సోషల్ మీడియాలో శ్రీముకి ఆర్మీని అని ఒక గ్రూప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు శ్రీముకి ఆర్మీతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దానికి తగ్గట్టే… శ్రీముఖి… రోజుకో ఫొటోషూట్‌లో తళుక్కుమంటూ… ఫ్యాన్స్‌ని పెంచుకుంటోంది.

బిగ్ బాస్ 2లో కౌశల్ ఆర్మీ పేరుతో కౌశల్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కౌశల్ గెలిచాడంటే అది కేవలం కౌశల్ ఆర్మీ సపోర్ట్ తోనే అని చెప్పుకోవాలి. కౌశల్ గెలుపులో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించడంలో ఇప్పుడు శ్రీముఖి కూడా అదే ఫాలో అవుతుంది. త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ షో లో శ్రీముఖి మెయిన్ అట్రాక్షన్ గా నిలువనుంది.

https://twitter.com/SreemukhiA/status/1147053562637123584

- Advertisement -