చిన్న పిల్లాడా..? అతనే ఆలోచించుకోవాలి..

183
Krishnam-Raju

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ కనిపించినా.. ఆయన కుటుంబ సభ్యులు కనిపించినా.. ముందు ఆయన పెళ్లి ప్రస్తావనే వస్తోంది. తాజాగా ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దానాన్న, సీనియర్ నటుడు కృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభాస్ పెళ్లి విషయంపై మాట్లాడారు. ప్రభాస్ ఏమైనా.. చిన్నపిల్లవాడా.. ముప్పై ఏళ్లు దాటాయి, ఇంకా పెళ్లి చేసుకో అని చెప్పడానికి, అతనే ఆలోచించుకోవాలి.

krishnam-raju-and-prabhas_

పెళ్లి చేసుకో, ఎప్పుడు చేసుకుంటావ్ అని అడుగుతూనే ఉంటాం.. హా చేసుకుంట పెద్దనాన్న అని చెబుతాడు. ఇలా గత కొంత కాలంగా జరుతూనే ఉందన్నారు. బాహుబలి సినిమాతో నటుడిగా జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమా బావుందని ప్రధాని మోడీ మెచ్చుకున్నారని చెప్పారు. ఇక సాహో సినిమా పూర్తి కాగానే.. తమ సొంత బ్యానర్ లోనే ప్రభాస్ తో ఓ సినిమా రూపొందించనున్నామని చెప్పారు. జూలై, ఆగస్టులలో ఈ సినిమాను ప్రారంభిస్తామని అన్నారు.

ఇక ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారని గతంలో టాక్ వినిపించింది. త్వరలో వారిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. మేం ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పడంతో ఆ రూమర్స్ కి బ్రేక్ పడింది. ఇక మెగా డాటర్ నిహారికతోను ప్రభాస్ పెళ్లి జరగనుందని ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తల్లో నిజం లేదని నాగబాబు చెప్పడంతో.. ఆ పుకార్లకు ఆ రోజే బ్రేక్ పడింది. చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యాచ్ లర్ గా ఉన్న రెబల్ స్టార్. ఆ లిస్ట్ లో తన పేరును ఎప్పుడు తొలగించుకుంటాడో చూడాలి ఇక.