లాస్యకు కాబోయే భర్త ….

251
- Advertisement -

యాంకర్‌ గా కెరీర్‌ స్టార్ట్ చేసి బుల్లితెర స్టార్ గా ఎదిగింది లాస్య. అందం, అభినయంతో అచ్చతెలుగు అమ్మాయిగా కుర్రకారు మనసు దొచేసింది. ఈ మధ్య యాంకరింగుకు కాస్త దూరంగా ఉన్న లాస్య ..వెండితెరపై హీరోయిన్‌గా వెలిగేందుకు సిద్ధమైంది. ‘రాజా మీరు కేక’ అంటూ ఓ సినిమాలో చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. అయితే సినిమా విషయం పక్కన పెడితే తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది లాస్య. ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

lasya engagement

ఓ ప్రత్యేకమైన రోజు కోసం రెడీ అవుతుండడం చాలా సంతోషంగా ఉంది. నా సోల్మెట్ తో నిశ్చితార్థానికి సిద్ధమవుతున్నా. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది అంటూ లాస్య నిన్న సోషల్ మీడియా ద్వారా అందరికి చెప్పి ఆశ్చర్యపరిచింది.

lasya

తాజాగా తనకు కాబోయే భర్తతో జంటగా దిగిన ఫొటోలను పోస్టు చేసింది. అలాగే పేరు, ఊరు వరకూ అతడిని పరిచయం కూడా చేసింది. అతడి పేరు మంజునాథ్ అట, మరాఠీ కుర్రాడు అని లాస్య వివరించింది. తన నిశ్చితార్థపు ఆనందాన్ని అంతా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది ఈమె. జీవితంలో వివాహానికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ ఎంతో ప్రత్యేకమైంది. నా సోల్మెట్తో ఎంగేజ్మెంట్ జరిగినందుకు చాలా ఆనందంగా ఉన్నా. ప్రేమ విలువైంది. పెళ్లికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ ఎంతో ఆసక్తితో కూడుకున్నది.’ అంటూ డిజైనర్ ఈశ్వరీ తయారు చేసిన ఎంగేజ్మెంట్ డ్రెస్లో ఉన్న ఫోటోను లాస్య తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది.

lasya engagement

స్నేహితుడు అయిన యాంకర్ రవి తో కలిసి బుల్లితెర మీద చెయ్యని షో అంటూ లేదు. ఇక వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పలు రకాల గాసిప్స్ మీడియాలో షికార్లు చేశాయి. ఇక ఏ షో లో వాళ్లు గెస్ట్ లు కింద వెళ్లినా కూడా మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారటగా… అని అడగగా లేదు మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే మా మధ్యన ఏం లేదని చెప్పేవారు. ఆ గాసిప్స్ ని రవి, లాస్యాలు ఇద్దరు ఖండించేవారు. అయితే కొద్దీ రోజులనుండి లాస్య ఉన్నట్టుండి బుల్లితెర మీద కనబడం మానేసింది. అలా బుల్లితెర మీద సడన్ గా లాస్య మాయమయ్యే సరికి ఆమెకి ఏదో అయ్యిందని… వేరే ఎవరితో ప్రేమాయణం నడుపుతుందని అబ్బో ఒకటేమిటి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అప్పుడు లాస్య తెర మీదకి వచ్చి నాకేం కాలేదని… నేను ఎవరితో ప్రేమలో లేనని …. ‘రాజా మీరు కేక’ సినిమాతో హీరోయిన్ గా మీకు చేరువవుతానని చెప్పుకొచ్చింది. మళ్లీ సడెన్‌గా ఇప్పుడు ఎంగేజ్ మెంట్ చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

- Advertisement -