రష్మీనే కాదు.. లాస్యను కూడా

219
Raja Meeru Keka Release on June16th
- Advertisement -

ఆర్‌కే స్టూడియోస్‌ “గుంటూర్ టాకీస్ “ అనే చిత్రంతో యాంకర్‌ రష్మీని ఒక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందే పాత్రలో పరిచయం చేయగా, అదేవిధంగ మరో యాంకర్‌ లాస్య ను ఒక ముఖ్యమైన పాత్రలో “ రాజా మీరు కేక “ అనే చిత్రంతో ప్రమోట్ చేస్తున్నారు.యలమంచలి రేవంత్,నోయెల్,మిర్చి హేమంత్,లాస్య,శోబిత రానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో నందమూరి తారకరత్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. పోసాని కృష్ణ మురళి, పృథ్వి,గుండు సుదర్శన్, కాశివిస్వనాథ్, శివ నారాయణ తదితరులు నటించారు. చక్కటి కథ,కథనం ఉన్న ఈ చిత్రానికి యువ దర్శకుడు కృష్ణ కిషోర్.టి దర్శకత్వం వహించారు.

Raja Meeru Keka Release on June16th

ఈ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 16వ తేదిన ఈ చిత్రం విడుదల అవుతుంది, సెన్సార్ బోర్డు అధికారులు మరియు దగ్గరి సన్నిహితులు ఈ చిత్రాన్ని చూసి అభినంధించారు, రామానాయుడు స్టూడియోస్ అధినేత సురేష్ బాబు సినిమాకు అభినందనలు తెలిపారు.

ఈ చిత్ర నిర్మాత ఏం.రాజ్ కుమార్ మాట్లాడుతూ.. సినిమా చాల బాగావచ్చిoది, మా మొదటి చిత్రం గుంటూరు టాకీస్ లాగే ఈ సినిమా ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాము, దర్శకుడు కృష్ణ కిషోర్ ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు అన్ని ఎమోషన్స్‌తో కూడిన చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 16వ తేదిన విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి నిర్మాత : రాజ్ కుమార్.యం, సహ నిర్మాత: రమేష్ రెడ్డి ఇటికేల, డీఓపి : రామ్ పి రెడ్డి, సంగీతం: శ్రీచరన్, ఆర్ట్: మారేష్ శివన్, స్టంట్స్‌: జాషువ,దర్శకుడు;కృష్ణ కిషోర్‌

- Advertisement -