బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూనే.. వెండితెరపై తన దైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తుంటారు యాంకర్ ఝాన్సీ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణం గురించి చెప్పారు. మొదట ఓ టీవీ ఛానల్ లో పోస్ట్ బాక్స్ నెంబర్ 1562 అనే ప్రోగ్రామ్ చేసే దానిని.. ఓ రోజు ఆఫీస్ కి వెళితే నా స్థానంలో వేరే యాంకర్ ఉన్నారు. ఇదేంటి సార్ అని అడిగితే.. మార్పు ఉండాలి కదా అని చెప్పారు. ఈ ఘటన నన్ను చాలా బాధించింది.
ఇక మరో స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ నన్ను అవమానపరిచారు. నాతో వారి సినిమాలో రెండు రోజుల షూటింగ్ చేయించుకున్నారు. మరుసటి నాకు చెప్పకుండా వేరే వ్యక్తితో ఆ క్యారెక్టర్ చేయించారు. అందుకు వారికి నా శాపం గట్టిగానే తగిలింది. వారు ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు. రెండు రోజుల షూటింగ్ డబ్బులు ఇచ్చారు.. కానీ నాకు చెప్పకుండా నన్ను తీసేసినందుకు చాలా బాధేసింది అంటూ చెప్పుకొచ్చారు.
కానీ ఇంతవరకు అవకాశం ఇవ్వాలంటూ ఎవరినీ అడలేదు. షూటింగ్ డబ్బులు ఇవ్వకున్నా అడగలే.. మనుషులను ఇంటికీ పంపించి గొడవపడలేదు. నాకు వచ్చిన అవకాశాలను చేస్తూ… వచ్చాను. నా మనసుకు కష్టం కలిగించేవారిని దూరంగా పెడుతూ వచ్చాను అని చెప్పారు.