పురపాలక శాఖ ప్రగతి నివేదిక-పూర్తి వివరాలు

270
ghmc ktr
- Advertisement -

రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌ పురపాలక శాఖ ప్రగతి నివేదికను విడుదల చేశారు. హరితప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్లు,కార్పొరేషన్ ఛైర్మన్లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సిడిఎంఎ , తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టియూయప్ ఐడిసి), పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, Directorate of Town and Country planning (DTCP), GHMC, HMWSSB( హైదరాబాద్ జలమండలి), HMRL, MEPMA లాంటి విభాగాలు పురపాలక శాఖలో భాగస్వాములుగా ఉన్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)

• హైదరాబాద్ దేశంలోనే ఐదవ అతి పెద్ద పట్టణం.. మెత్తం 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దాదాపు ఒక కోటి మంది జనాబా నగరంలో నివసిస్తున్నారు.
• 2017- 18 వ సంవత్సరానికి జిహెచ్ఎంసి ఆదాయం 2616 కోట్ల రూపాయలు
• పన్నులను పెంచకుండానే ఆదాయాన్ని పెంచుకోవడం జరిగింది
 2013- 14 లో 747 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లను 2017- 18 నాటికి 1450 కోట్లకి పెంచడం జరిగింది
 ఆస్తిపన్ను కోసం Online Self Assessment System ఏర్పాటు
 ట్రెడ్ లైసెన్సుల జారీ కేవలం రెండు డాక్యుమెంట్స్ తో సులభతరం చేశాం,
• మున్సిపల్ బాండ్లను జారీ చేసిన రెండవ పురపాలక సంస్ధ
• 2018లో బాంబే స్టాక్ ఎక్సేంజ్లో మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా 486 కోట్ల రూపాయలను సేకరణ

• పేద ప్రజలకి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం పథకం హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున కొనసాగుతుంది.
• 2018- 19 నాటికి మెత్తం109 ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు పోతున్నాం

వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం-SRDP

• రెండు దశల్లో ఈ కార్యక్రమం జరుగుతున్నది
• 135 కిలోమీటర్లు మేర ఏడు స్కై వేలు
• 11 మేజర్ కారిడార్లలో 166 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణం
• 68 ప్రధాన రహదారుల పైన మరో 348 కిలోమీటర్లు
• 1400 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం
• 54 గ్రేడ్స్ సేపరేటర్లను సైతం ఈ కార్యక్రమంలో తీసుకోవడం జరుగుతుంది

2017- 18 సంవత్సరాల్లో SRDP సాధించిన ప్రగతి

• మొదటిదశలో భాగంగా 2631 కోట్ల రూపాయలతో ఐదు ప్యాకేజీలుగా సుమారు 20 జంక్షన్ల పనులను ఈ పథకం కింద కవర్ చేయడం జరిగింది

• దీంతోపాటు మరో ఐదు ప్రధానమైన పనులను 1437 కోట్లతో ప్రారంభించడం జరిగింది. ఇందులో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం ఒకటి
• ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప సోసైటీ, మైండ్ స్పేస్ జంక్షన్, చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద అండర్ పాస్ లను వినియోగంలోకి తీసుకురావడం జరిగింది

హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్

• హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2013 మార్చిలో ఏర్పాటు చేయడం జరిగింది
• బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులను సేకరించుకొనేందుకు ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలకు గ్యారంటీ ఇవ్వడం జరిగింది.
• ఆర్ అండ్ బి శాఖ నుంచి 240 కిలోమీటర్ల పొడవైన 41 రోడ్లను ఈ కార్పొరేషన్ కి బదిలీ చేయడం జరిగింది
• దీంతోపాటు 52 కిలోమీటర్ల నేషనల్ హైవేను, 32 కిలోమీటర్ల ఇతర రోడ్లను ఈ కార్పొరేషన్ కి బదిలీ చేయడం జరిగింది
• కార్పోరేషన్ కింద ఉన్న రోడ్లను మోడల్ రోడ్ కారిడార్లు గా చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం
• ప్రభుత్వం ఇప్పటికే 1930 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులను మంజూరు చేయడం జరిగింది.
• 2018 -19 బడ్జెట్లో సుమారు 750 కోట్ల రూపాయలను కార్పోరేషన్ కోసం కేటాయించడం జరిగింది
• ఇప్పటికే సుమారు 2716 కోట్ల రూపాయల విలువైన 29 ప్యాకేజీల్లో పనులను కార్పొరేషన్ చేపట్టడం జరిగింది

ghmc

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్

• హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో ఉన్న 57 కిలోమీటర్ల మూసి అభివృద్ధిని ఈ ప్రాజెక్ట్ కింద చేపట్టడం జరుగుతుంది
• ఇందులో భాగంగా మూడు కిలోమీటర్ల మేర ముస్లిం జంగ్ బ్రిడ్జ్ నుంచి గొల్నాక బ్రిడ్జి వరకు చేపట్టిన ప్రాజెక్టు ఆరు నెలల్లో పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం
• రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళికను రూపొందిస్తున్నారు
• 2018 ఫిబ్రవరి మాసంలో ప్రాజెక్టుకి తుది రూపం ఇచ్చే ప్రణాళికలు ప్రారంభమయ్యాయి
• 2018 మార్చి లో ప్రాజెక్టు ఆర్. యప్. పి (RFP) మరియు డ్రోన్ సర్వే పూర్తి అయింది
• 2018 ఏప్రిల్ మాసం నుంచి ప్రఖ్యాత అర్బన్ డిజైనింగ్ సంస్థలతో డిజైన్ల పైన కలిసి పనిచేస్తున్నాం
• త్వరలోనే డిజైన్లు పూర్తి చేసి డిసెంబర్ 2018 నాటికి మూసి అభివృద్ధి ప్రణాళిక తుదిరూపునిస్తాం

చెరువుల పునరుద్ధరణ అభివృద్ధి

• హైదరాబాద్ నగరంలో 145 చెరువులు ఉన్నాయి
• మొదటి దశ 40 చెరువులను ఎంపికచేసి జిహెచ్ఎంసి హెచ్ఎండిఎ 20 చెరువులను అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాయి
• ఇందులో ముఖ్యంగా దుర్గం చెరువు ప్రత్యేక అకర్షణగా చెప్పొచ్చు
• నగరంలో 826 మోడ్రన్ బస్సు షెల్టర్లు ఏర్పాటు. నాలుగు గ్రేడ్లుగా విభజించి ఇప్పటికే పలుచోట్ల ఏసీ బస్ షెల్టర్లు మరియు ఇతర గ్రేడ్ల షెల్టర్ల కూడా ప్రారంభం చేయడం జరిగింది
• జవహారం నగర్ డంప్ యార్డులో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన 10 నుంచి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల చెత్తను సుమారు 144 కోట్ల రూపాయలతో గ్రీన్ క్యాపింగ్ చేసే కార్యక్రమం వేగంగా నడుస్తుంది.

స్వచ్ఛ హైదరాబాద్

• ఘన వ్యర్థ నిర్వహణ నిబంధనలు -2016ను అందుకునేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లింది
• ముందుగా మహిళా స్వయం సహాయక సంఘాల్లో చురుకైన వారిని గుర్తించి స్వచ్ఛ దూతలుగా నియమించి, 2017 డిసెంబర్ 12 నాటికి సుమారు 9.32,520 కుటుంబాలను కలిసి తడి- పొడి చెత్త పైన అవగాహన కల్పించాము
• 22 లక్షల ఇళ్లకి 44 లక్షల చెత్త బుట్టలను ఇవ్వడం జరిగింది
• నూతనంగా నగరంలో 2000 స్వచ్ఛ ఆటోలను వినియోగంలోకి తీసుకోచ్చాం
• 1116 గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ని తొలగించడం జరిగింది
• ప్రజలతో మమేకమయ్యేందుకు శానిటేషన్ సిబ్బంది ని ప్రజలకు అనుసంధానించే “పరిచయం” అనే వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరిగింది
• అత్యాధునిక షి టాయిలెట్ల ( SHE toilets) ఏర్పాటు.. ఇప్పటిదాకా 32 షి టాలెట్లు ఏర్పాటు
• నగరంలో మరో వినూత్న ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. లూ కేఫ్ పేరుతో 100 స్వచ్ఛమైన అత్యాధునిక టాయిలెట్ సౌకర్యాన్ని ఏర్పాటు
• బహిరంగ మూత్ర విసర్జన అరికట్టేందుకు లాఠీ- సిటీ పేరుతో మరొక కార్యక్రమం
• దీంతో పాటు నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు say no to plastic అనే కార్యక్రమం
• జనవరి 2018 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత (ODF) హోదాను అందుకోవడం జరిగింది
• 2018 స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులలో ఉత్తమ రాష్ట్ర రాజధాని నగరంగా అవార్డును అందుకోవడం జరిగింది

నాలాల సర్వే మరియు ఆక్రమణల తొలగింపు

• హైదరాబాద్ నగరంలో సుమారు 173 ప్రధాన నాళాలు 390 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి
• నాలలపైన ఆక్రమణల గుర్తింపుకు వివిధ శాఖలతో కూడిన 33 బృందాలను ఏర్పాటు చేశాం
• ఇప్పటికే అందుబాటులో ఉన్న రెవెన్యూ మ్యాపులతోపాటు, అత్యాధునిక సాటిలైట్ టెక్నాలజీతో నాలాల హద్దులను గుర్తించే కార్యక్రమం 250 కిలోమీటర్ల మేర పూర్తి అయింది
• మొదటి దశలో నాలాలకు అడ్డంగా ఉన్న సుమారు 800 అక్రమలణలు (బాటిల్ నెక్స్) ని గుర్తించడం జరిగింది
• నగరంలో నాలాల ఆక్రమణలు, ఫుట్ పాత్లు, ఇతరత్రా ఆక్రమణలను తొలగించేందుకు, నియంత్రించేందుకు ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది
• ఈ విభాగం ఆధ్వర్యంలో ఫుట్పాత్ల ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ప్రారంభం అయింది
• ఇప్పటిదాకా సుమారు ఆరువేల ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించడం జరిగింది
• హైదరాబాదులో ఉన్న ఐదు నుంచి పది వేల జనాభాకు ఒక బస్తీ దావఖాణ ఉండాలన్న లక్ష్యంతో బస్సులను ఏర్పాటు చేయడం ప్రారంభించారు
• ఇప్పటికి 17 బస్తీ దావఖాణలు నగరంలో నడుస్తున్నాయి త్వరలోనే వీటిని పెంచుతాం
• నగరంలో “అన్నపూర్ణ” పేరుతో 5 రూపాయలకే భోజనం కల్పించే కార్యక్రమం నడుస్తోంది. నగరంలో ప్రస్తుతం 150 అన్నపూర్ణ కేంద్రాలున్నాయి. దీనిద్వారా రోజు 40 వేల మందికి భోజనం లభిస్తుంది.

గత నాలుగేళ్లలో సాధించిన విజయాలు

• జిహెచ్ఎంసి మరింతగా వికేంద్రీకరించి ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో ఆరు జోన్లుగా 30 సర్కిళ్లుగా విస్తరించడం జరిగింది. దీన్ని మరింతగా విస్తరించి 10 జోన్లు 50 సర్కిళ్లుగా విస్తరించనున్నాం

• DPMS (డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ మానేజ్మెంట్ సిస్టమ్) పేరుతో 100% ఆన్లైన్ ద్వారా భవన అనుమతులను ఇస్తున్నాం
• డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం వివిధ శాఖల పిర్యాదులకు ఓకే కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది

• మై జిహెచ్ఎంసి యాప్ ప్రారంభం
• కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి 14 వేల రూపాయల వేతనం పెంపు
• పురపాలనలో టెక్నాలజీ వినియోగాన్ని ముఖ్యంగా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడం జరిగింది
• ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రజలతో నిరంతరం ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది
• పురపాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వినూత్న మైనటువంటి “మన నగరం” అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే నాలుగు మన నగరం కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం జరిగింది

తెలంగాణకు హరితహారం

• రాష్ట్రంలో గ్రీన్ కవర్ ను 33 శాతం పెంచాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమం లో జిహెచ్ఎంసి చురుగ్గా భాగస్వామ్యం తీసుకుంటుంది.
• జులై 11 2016న ఒకేరోజు 29 లక్షల 19వేల మొక్కలను ఒకేరోజు నాటడం జరిగింది.
• 2017- 18 సంవత్సరానికి జిహెచ్ఎంసి మరో 77 లక్షల మొక్కలు నగర పరిధిలో నాటడం జరిగింది
• ఈ సంవత్సరం కూడా మరో 45 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగింది
• 2017న మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కరీంనగర్ మున్సిపాలిటీలో ప్రారంభించారు.
• అవుటర్ రింగ్రోడ్ చుట్టూ హెచ్ఎండిఏ చేపట్టిన ప్లాంటేషన్ కార్యక్రమం మరొక కీలకమైన అంశంగా చెప్పొచ్చు.
• గత మూడు సంవత్సరాల్లో సుమారు 38 లక్షల మొక్కల్ని అవుటర్ రింగ్రోడ్ చెట్టు నాటడం జరిగింది.
• హరితహారం కార్యక్రమం లో భాగంగా 7 కోట్ల మొక్కల లక్ష్యానికి చేరువగా హెచ్ఎండిఏ పనిచేస్తుంది
• గత మూడు సంవత్సరాలుగా సుమారు 3కోట్ల మొక్కలు నాటడం జరిగింది. దీంతో పాటు మరో 2 కోట్ల మొక్కల్ని ఇళ్లలో( Homesteads) పెంచుకోవడానికి సరఫరా చేయడం జరిగింది
• ఈ సంవత్సరం మరో కోటిన్నర మొక్కలు నాటడంతో పాటు మరో రెండున్నరకోట్ల మొక్కల్ని వివిధ నర్సరీల్లో పెంచే లక్ష్యంతో హెచ్ఎండిఏ పనిచేస్తుంది
• దీంతో పాటు మరో ఎనిమిది లక్షల మొక్కలు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్దిలో భాగంగా ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో నాటడం జరిగింది

హైదరాబాద్ జలమండలి -HMWSSBB

• హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రస్తుతం నగరంలో 448 MGDల నీటిని సరఫరా చేస్తుంది
• 750 MLDల మురికినీటిని శుద్ధి చేస్తుంది
• గత నాలుగు సంవత్సరాల్లో అర్బన్ మిషన్ భగీరథ, ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు ద్వారా నగరంలో నీటి సరఫరా వ్యవస్థను మరింతగా విస్తరించింది
• పరిసర మున్సిపాలిటీలలో నీటి సరఫరాకోసం మిషన్ భగీరథ కింద 1906 కోట్ల రూపాయలతో పనులు
• 280 ఎంఎల్ ల 56 రిజర్వాయర్లు పూర్తి
• రెండు వేల కిలోమీటర్ల ట్రంక్ మరియు నీటి సరఫరా నెట్వర్క్ పనులు పూర్తి
• 13 నెలల రికార్డు సమయంలో అత్యంత వేగంగా పనులు పూర్తి
• దీంతో 35లక్షల నగర పౌరులకి లబ్ది
• లక్ష కొత్త కనెక్షన్ల ఏర్పాటు
• అర్బన్ మిషన్ భగీరథ కింద అవుటర్ రింగ్రోడ్ లోపల ఉన్న గ్రామాలకు 738 కోట్లతో వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్
• ఇందులో భాగంగా 180 రిజర్వాయర్లు, 2000 కిలోమీటర్ల పైప్లైన్ పనుల ప్రారంభం
• ఈ పథకం కింద పది లక్షల జనాభాతో పాటు లక్షాయాబై వేల కొత్త కనెక్షన్లు మంజూరు
• ఘన్ పూర్ రిజర్వాయర్ నుంచి పటాన్చెరువు కు 398 కోట్ల రూపాయలతో 1800 డయాతో ఎంఎస్ పైపు లైన్ నిర్మాణం
• ఈ ప్రాజెక్టు ఆగస్టు 2018 నాటికి పూర్తయ్యే అవకాశం
• హుస్సేన్ సాగర్లోకి మురుగునీటి రాకుండా అరికట్టేలా నెక్లెస్ రోడ్ నుంచి జిహెచ్ఎంసి ఆఫీస్ వరకు దాదాపు 1. 6 కిలోమీటర్ల మేర 1800 ఎం ఎం డయాతో ట్రంక్ మెయిన్ ఏర్పాటు
• మినీ జెట్టింగ్ మెషిన్ల వినియోగం, మాన్యువల్ క్లీనింగ్ అరికట్టేలా ఈ మిషన్ల వినియోగం..
• ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక అభినందనలు.
• వాన నీటిని ఒడిసి పట్టేందుకు జలం జీవం కార్యక్రమం ప్రారంభం

జలమండలి 2018 -19 కి యాక్షన్ ప్లాన్

• 4777 కోట్ల రూపాయలతో కేశవాపురం ప్రాజెక్టు నిర్మాణం. ఈ ప్రాజెక్టు ద్వారా 10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 750 MLD తాగునీరు హైదరాబాద్కు వచ్చే అవకాశం

• కృష్ణ గోదావరి తాగునీటి సరఫరా వ్యవస్థను అనుసంధానం చేసే అవుటర్ రింగ్రోడ్ రింగ్ మెయిన్ పనులు
• 10 టీఎంసీల స్టోరేజీ సామర్థ్యం కలిగిన కృష్ణ నీటిని నిల్వచేసే దేవల నాగారం చౌటుప్పల్ రిజర్వాయర్ నిర్మాణం
• జిహెచ్ఎంసి తో పాటు పరిసర మున్సిపాలిటీలు అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాల మురికి నీటి శుద్ది అవసరాలను తీర్చేలా ఇంటిగ్రేటెడ్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ తయారీ
• పరిసర మునిసిపాలిటీల్లో ఎస్టీపిల నిర్మాణంతోపాటు మురికినీటి వ్యవస్థను మరియు 1000 MLDల రీసైక్లింగ్ కోసం 5000 కోట్ల రూపాయలతో DPR తయారీ
• ప్రధాన నగరం లోపల స్ట్రామ్ వాటర్ నాలాలోకి మురికినీరు చేరకుండా మూసి వెంబడి ప్రత్యేక మురికినీటి కాలువలను వ్యవస్థను తయారుచేసేందుకు మరో మూడు వేల కోట్లతో డీపీఆర్ సిద్ధం చేయడం
• SCADA, డిజిటల్ మీటర్ల వంటి ఇతర టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను వినియోగించుకొని నాన్ రెవెన్యూ వాటర్ (NRW)ని మరింతగా తగ్గించేందుకు అవసరమైన ప్రాజెక్టు చేపట్టడం. ఇందుకోసం సుమారు 1,500 కోట్ల రూపాయలతో DPR తయారీ

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ -HMRL

• హైదరాబాద్ ని విశ్వ నగరంగా మార్చేందుకు నగరంలో అత్యంత రద్దీ ఉన్న మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణం
• 2017 నవంబర్ లో 30 కిలోమీటర్ల మేర మియాపూర్ – అమీర్పేట్ నాగోల్ మెట్రో రైల్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రారంభించారు
• త్వరలో ఇతర మార్గాల్లో సైతం మెట్రోను ప్రారంభం చేసేందుకు వేగంగా పనులు నడస్తున్నాయి
• 16 కిలోమీటర్ల అమీర్పేట్ నుంచి ఎల్. బి నగర్ మెట్రో మార్గం ఆగస్టు 2018లో ప్రారంభమయ్యే అవకాశం
• అక్టోబర్లో అమీర్పేట్ నుంచి హైటెక్సిటీ మార్గం ప్రారంభం
• వచ్చే ఏడాదిలోగా మెట్రో రెండవ దశ DPR తయారీ
• 30 కిలోమీటర్ల ఎయిర్ పొర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో కారిడార్ ప్రణాళికలు వేగంగా నడుస్తున్నాయి

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ- HMDA

• 7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాలతో 7257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కార్యకలాపాలు
• 2015- 16 లో 365 కోట్ల ఆదాయం 2017- 18 నాటికి 109 కోట్లకు పెరిగింది
• చాలాకాలం పెండింగ్లో ఉన్న కండ్లకోయ ఇంటర్చేంజ్ అవుటర్ రింగ్రోడ్ పనులు పూర్తయ్యాయి. దీంతో 158 కిలోమీటర్ల అవుటర్ రింగ్రోడ్ ప్రాజెక్టు పూర్తిగా వినియోగంలోకి వచ్చింది
• 960 కోట్ల రూపాయలతో 5 ఇంటర్చేంజ్ ల వద్ద 44 కిలోమీటర్ల మెయిన్ క్యారేజ్ వే పనులు పూర్తి
• గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు అవుటర్ రింగ్రోడ్డు పైన ఎల్ఇడి లైటింగ్
• 1.1 కిలోమీటర్లు ఉన్న ఫతేనగర్- బాలానగర్ ఫ్లైఓవర్ 387 కోట్ల రూపాయలతో ప్రారంభం
• మంగళంపల్లి,లాజిస్టిక్స్ పార్క్ (20 ఎకరాలు) బాటసింగారం లాజిస్టిక్ (35 ఎకరాలు) పనులు ప్రారంభం
• ఉప్పల్ భగాయత్ పనులు పూర్తి… ఉప్పల్ భగాయత్ భూపంపిణీకి అంతా సిద్ధం… రెండు వందల కోట్ల రూపాయలతో లేఅవుట్ ని అభివృద్ధి చేసిన హెచ్ఎండిఏ..
• హెచ్ఎండిఎ కృషి వలన వందల కోట్ల రూపాయల విలువైన 719 ఏకరాల కోకాపేట్ భూమి ప్రభుత్వ పరమైంది
• ప్రస్తుతం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 21 చెరువుల అభివృద్ధి మరియు సుందరీకరణ పనులను 220 కోట్ల రూపాయలతో చేపడుతున్నాం
• 100 కోట్ల రూపాయలతో 44 ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం
• ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో కొత్వాల్గూడ లో ఎకో టూరిజం పార్క్
• ఉప్పల్ భగాయత్లో శిల్పారామం ఏర్పాటు
• రెండు వందల కోట్ల రూపాయల నిధులతో నార్సింగి నుంచి కోకాపేట వరకు సర్వీస్ రోడ్డు నిర్మాణం
• అవుటర్ రింగ్రోడ్ వెంబడి 13 సాటిలైట్ టౌన్షిప్ నిర్మాణానికి ప్రయత్నం

కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(CDMA)

• ప్రస్తుతం జిహెచ్ఎంసి మినహా 73 పురపాలికలు రాబోయే 68 నూతన పురపాలికలు ఈ విభాగం కింద పనిచేస్తాయి
• మొత్తంగా 6 కార్పొరేషన్లు 136 మున్సిపాల్టీలు ఉండబోతున్నాయి… దీంతో 2020 నాటికి రాష్ట్రంలోని 50 శాతం జనాభా పట్టణాల్లో ఉండనుంది.
• మొత్తం 73 పురపాలికలు 58 ఇప్పటికే ఓపెన్ డెకరేషన్స్ ప్రీ (ODF) హోదాను సాధించాయి, ఇందుకోసం ఒక 1,46,000 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు
• 792 పబ్లిక్ మరియు కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మాణం చేసి జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది
• పురపాలికలు రోజువారి చెత్తను తరలించడంలో 90% కవరేజ్ సాధించగలిగాం
• 14 లక్షల 59వేల చెత్తబుట్టల పంపీణీ
• 47 పురపాలికలు కంపోస్టింగ్ జరుగుతున్నది
• పురపాలిక లలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కోటి 60లక్షల తో రక్షక కవచాలు, తొడుగులు, హెల్మెట్ల వంటి సామగ్రి సరఫరా
• పురపాలికలు సిటిజన్ సర్వీస్ సెంటర్లను (CSC) ఏర్పాటు చేయడం జరిగింది
• మున్సిపల్ సర్వీస్ మానిటరింగ్ డాష్ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా వివిధ కార్యక్రమాలు పథకాల అమలును పరీక్షించడం జరుగుతుంది
• వైకుంఠ దామం కార్యక్రమంలో భాగంగా వివిధ పట్టణాల్లో 52 స్మశానవాటికను అభివృద్ధి చేయడం జరిగింది
• పురపాలికల్లోని సుమారు 3వేల ఖాళీ స్థలాలను 150 కోట్ల రూపాయలతో పార్కులగా అభివృద్ది చేసే కార్యక్రమం ప్రారంభమైంది
• పురపాలిక లోని వీధి దీపాలను ఎల్ఈడి లైట్లతో రిప్లేస్ చేసే కార్యక్రమం
• ఇందులో భాగంగా 3,40,000 వేల లైట్ల స్దానంలో ఎల్ఈడీ లైట్లుతో బిగించడం జరిగింది
• దీంతో సుమారు 44 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులో ఆధార్ జరిగే అవకాశం ఉంది
• పురపాలికల్లో 203 వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణానికి 32 కోట్ల రూపాయలను వెచ్చించనున్నం
• 14 కోట్ల రూపాయలతో 130 జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పనులు ప్రారంభం
• ఈ – ఆఫీస్ వినియోగం

CDMA భవిష్యత్తు లక్ష్యాలు

• పట్టణాల్లో కనీసం పదిశాతం గ్రీన్ కవర్ను తెలంగాణ హరితహారం లో భాగంగా సాధించడం
• పార్కులు, స్మశానాల అభివృద్ధి
• ప్రయోగాత్మకంగా డిజిటల్ డోర్ నంబరింగ్ విధానాన్ని పరిచయం చేయడం
• 307 గుర్తించిన పార్కుల్లో ఓపెన్ జిమ్ముల ఏర్పాటు
• 100% సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లక్ష్యాన్ని అన్ని పురపాలికలు సాధించడం
• పురపాలికలు మాస్టర్ ప్లాన్ రూపొందించడం

PHE – పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కింద చేపట్టిన కార్యక్రమాలు

• ప్రస్తుతమున్న పురపాలిక లతోపాటు నూతనంగా ఏర్పాటు కానున్న మున్సిపాలిటీలోని మురికినీటి శుద్ధి నిర్వహణపైనా అవసరమైన ప్రాజెక్టుకు DPRను తయారు చేయడం జరుగుతున్నది
• ఇప్పటికే సిద్దిపేట పురపాలికలు 193 కోట్ల రూపాయలతో సిద్దిపేట సివరేజ్ ప్రాజెక్టు ప్రారంభం అయింది
• కరీంనగర్, నల్లగొండ, మిర్యాలగూడ, నిజామాబాద్ పట్టణాల్లో 478 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నడుస్తున్నాయి
• 2019 నుంచి దాదాపు అన్ని కార్పొరేషన్లు మేజర్ మునిసిపాలిటీల్లో చేపట్టనున్న సీవరేజీ కార్యక్రమాలకి సుమారు 20వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అన్న అంచనా ఉంది

డైరెక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ – DTCP

• 2017 18 సంవత్సరానికి 93వేల దరఖాస్తులను ఎల్ఆర్ఎస్ లో భాగంగా పరిష్కరించగా 342 కోట్ల రూపాయలు లభించాయి
• 37 పురపాలికలు జీఐఎస్ మ్యాప్ తయారీ డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయి
• యాదగిరి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (YTDA) డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారయింది
• దీంతోపాటు వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(VMTAD) మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం అవుతుంది

• యాదగిరి, వేములవాడ, స్తంభాద్రి, శాతవాహన, సిద్దిపేట, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది

తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – TUFIDC

• 200 కోట్ల రూపాయల బడ్జెట్ 2018- 19 లో కేటాయించడం జరిగింది
• మరో 2000 రూపాయలను పలు ఆర్థిక సంస్థల నుంచి సేకరించుకొనేందుకు ప్రభుత్వం అనుమతించింది
• 44 పురపాలిక లో సుమారు 460 కోట్ల రూపాయలతో పలు మౌలిక వసతుల ఏర్పాటు కోసం పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది

వివిధ కార్పోరేషన్లలో చేపట్టిన పలు ముఖ్యమైన కార్యక్రమాలు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్

• గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి 300 కోట్ల రూపాయలను 2016 – 17 బడ్జెట్లో కేటాయించడం జరిగింది.. వీటిద్వారా నగరంలోని ప్రధాన రోడ్లతోపాటు స్మశానవాటికనల అభివృద్ధి మరియు ఇతర మౌలిక వసతుల కల్పన చేయడం జరిగింది

• కార్పొరేషన్ పరిధిలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి దేశంలోనే మొదటి నగరంగా నిలిచింది
• రాష్ట్రంలో తొలిసారిగా అండర్గ్రౌండ్ లో చెత్త డబ్బాలను ఏర్పాటు చేయడం జరిగింది

మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్

• 25 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణం
• మానేరు రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా సుమారు 500 కోట్ల రూపాయల అనుమతులు
• మిషన్ భగీరథ మరియు అభివృద్ధి పథకంలో భాగంగా 109 కోట్ల రూపాయలతో నీటి సరఫరా ప్రాజెక్టు
• కరీంనగర్ సిటిజన్ బడ్డీ మొబైల్ యాప్ ప్రారంభం

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్

• 2016 -17, 17- 18 సంవత్సరాలకు ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంటును ముఖ్యమంత్రి ప్రకటించారు
• 20 పార్కులను అభివృద్ధి చేయడం జరిగింది
• 230 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పనులు
• పది ఎకరాల విస్తీర్ణంలో మహిళా స్టేడియం ఏర్పాటు

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

• నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీఎం గారు ఇప్పటిదాకా 200 కోట్ల రూపాయల ప్రత్యేకనిధులు ఇచ్చారు
• ఇందులో భాగంగా సుమారు 23 వర్కులను చేపట్టడం జరిగింది
• 98 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పనులు
• సుమారు 170 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
• రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సైతం ఇప్పటి దాకా 200 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చాము.
• పరిధిలో సుమారు 90 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పనులు

- Advertisement -