GIC:హరితసేనలో నందు,అక్షిత

7
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు యాంకర్, నటి ఇందు ఓరుగంటి మరియు అక్షిత సాయి. ఇందు మరియు అక్షిత మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు ఎంతో అవసరం అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే భాద్యత చేపట్టాలి అన్నారు.

రేపటి తరాలకు మనము ఇచ్చే ఆస్థి మంచి వాతావరణం, మంచి ఆక్సీజన్ అని ఇది జరగాలంటే ప్రతీ ఇంట్లో మూడు మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి అని ఇంతటి గొప్ప కార్యక్రమం లో అవకాశం కల్పించిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇందులో భాగంగా ఇందు ఛాలెంజ్ చేస్తూ నటులు మోన, లాస్య, ధనుష్ గారు అక్షిత ఛాలెంజ్ చేస్తూ వైషు, ఆకాష్ మరియు తేజ కూడా మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమం లో సాహితి తదితరులు పాల్గొన్నారు.

Also Read:TG:రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

- Advertisement -