Metro:అమల్లోకి పెరిగిన మెట్రో ఛార్జీలు

12
- Advertisement -

హైదరాబాద్ మెట్రో పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. టికెట్ ధరలను 25 శాతం పెంచింది మెట్రో యాజమాన్యం. దీంతో నేటి నుంచి మెట్రో రైలు లో కనిష్ట ధర 12 రూపాయలు కాగా గరిష్ట ధర 75 రూపాయలు.

ఇప్పటికే మెట్రో కార్డ్స్ పై ఉన్న రాయితీ లకు మంగళం పాడింది మెట్రో యాజమాన్యం. అలాగే మెట్రో హాలీ డే కార్డ్ ను పూర్తి గా రద్దు చేసింది మెట్రో యాజమాన్యం.పార్కింగ్ ఫీజులు, టాయిలెట్స్ కు డబ్బులు వసూలు చేస్తోంది మెట్రో యాజమాన్యం.

మెట్రో టికెట్ చార్జీల పెంపు ను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీ ల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. పెరిగిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

Also Read:TG:రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

- Advertisement -