అవి పెరిగాయన్న వార్తలు అబద్ధం..

754
- Advertisement -

బుల్లితెరపై సత్తా చాటి, ప్రస్తుతం వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది యాంకర్ అనసూయ. అందంతోపాటు అట్రాక్షన్ కూడా పుష్కలంగా ఉండటంతో టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

క్షణం సినిమాలో ఓ నెగిటివ్ రోల్ చేసి తనలో యాక్టింగ్ టాలెంట్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది.

Anchor Anasuya Reacts On Plastic Surgery Rumours

ఇదిలా ఉంటే..గత కొన్ని రోజులుగా అనసూయపై తెగ రూమర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకేముందీ..ఆ విషయం కాస్తా…అను వరకి చేరిపోయింది.

దాంతో తనపై సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వార్తలపై సీరియస్ అయ్యింది అనసూయ. ఇటీవలి కాలంలో అనసూయ బాగా లావైపోతోందని, నడుము సైజు విపరీతంగా పెరిగిపోయిందని, సన్నబడేందుకు ఆమె ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటోందని వార్తలు వచ్చాయి.

Anchor Anasuya Reacts On Plastic Surgery Rumours

ఈ వార్తలను ఓ అభిమాని అనసూయ దృష్టికి తీసుకురావటంతో ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను షార్ట్ కట్స్ నమ్మనని.. ఎలాంటి సర్జరీ చేయించుకోవటం లేదని తెలిపింది.

తన నుంచి ఎలాంటి సమాచారం తీసుకోకుండానే ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారని కాస్త ఘాటుగానే స్పందించింది. మొదట ఈ విషయాన్ని లైట్ తీసుకుంది అనసూయ. కానీ, ఆ పుకారు రోజురోజుకు ఎక్కువవడంతో పాటు.. ప్రేక్షకులు దాన్నే నిజమని భావించే స్టేజ్ కు వెళ్లిపోయారు. దీంతో అనసూయ ఆ పుకారుపై క్లారిటీ ఇవ్వక తప్పలేదు మరి.

- Advertisement -