గంభీర్ ఇంట్లో మరో యువరాణి..

321
Gautam Gambhir Welcomes 'Little Angel' To Family
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న గౌతమ్‌ గంభీర్‌ మరోసారి తండ్రయ్యాడు. గంభీర్ భార్య నటాషా బుధవారం పండంటి పాపకు జన్మినిచ్చింది. అతడికి ఇదివరకే ఆజీన్ అనే అయిదేళ్ల కూతురు ఉంది. ఇప్పుడు రెండో పాప జన్మించింది. ఈ సందర్భంగా గంభీర్ తన సంతోషాన్ని అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.

 Gautam Gambhir Welcomes 'Little Angel' To Family

“మమ్మల్ని దీవించేందుకు మా కుటుంబంలోకి మరో యువరాణి అడుగుపెట్టింది. ఆమె రాకతో మా జీవితంలో వెలుగులు నిండాయి. యువరాణికి స్వాగతం”, అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 2011లో గంభీర్‌ నటాషాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

  Gautam Gambhir Welcomes 'Little Angel' To Family

                                         .    Gautam Gambhir Welcomes 'Little Angel' To Family

అయితే వీరికి తొలుత పుట్టిన ఆడ పిల్లకు ఆజీన్ అని పేరు పెట్టారు. చిన్న పాపను ఆజీన్‌ ఒడిలో కూర్చోబెట్టుకున్న ఫొటోను గంభీర్‌ ట్విటర్‌లో ఉంచాడు. ఈ సందర్భంగా క్రీడాకారులు, అభిమానులు గంభీర్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం విండిస్ పర్యనటలో ఉన్న కెప్టెన్ కోహ్లీతో పాటు ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా‌ కూడా ఇటీవలే తండ్రయ్యాడు. జూన్ 13 న జడేజా భార్య సోలంకీ పండింటి పాపకు జన్మనిచ్చింది.

- Advertisement -