ఆడపడుచు పరువు తీస్తున్నావు.. అనసూయ పంచ్..

75
Anchor Anasuya
- Advertisement -

యాంకర్ అనసూయకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. బుల్లితెరపై.. వెండితెరపై తన వాక్చాతుర్యంతో.. నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. వరుస ఆఫర్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్న అనసూయకు ట్రోలింగ్ కొత్తేమి కాదు. తాను షేర్ చేసే ప్రతి చిన్న ఫోటోపై.. పోస్ట్‏లపై ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తుంటారు నెటిజన్స్. ముఖ్యంగా అనసూయ డ్రెస్సింగ్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే తనను ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేసే వారికి తనదైన స్టైల్లో కౌంటరిస్తుంది అనసూయ. ఎప్పటికప్పుడు తన పోస్టులపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తుంది అనసూయ.

తాజాగా మరోసారి తన డ్రెస్సింగ్ పై ట్రోల్ చేసిన ఓ నెటిజన్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చింది. ‘అనసూయ మీరు ఇద్దరు పిల్లల తల్లి అయ్యిండి ఇలాంటి బట్టలు వేసుకుంటావా.. తెలుగు ఆడపడుచు పరువు తీస్తున్నావు’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి అనసూయ దిమ్మదిరిగే రిప్లై ఇచ్చింది. దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు’ అని ఆ నెటిజన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది అనసూయ.

ప్రస్తుతం తను చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయ ట్వీట్‏కు నెటిజన్స్ మద్దతు తెలుపుతున్నారు. పని పాట లేక కామెంట్స్ చేస్తారని.. అలాంటివేం పట్టించుకోకుండా మీ పని మీద ఫోకస్ చేయండి అంటూ అనసూయకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఆ కామెంట్స్ పై కూడా అనసూయ రియాక్ట్ అయ్యింది. ” ఇలాంటి కామెంట్లకు రియాక్షన్ అవసరం.. ఎందుకంటే కొద్దిమంది పురుషులు తమ కుటుంబాల్లో.. వారి పని ప్రదేశంలో.. సాధారణంగా స్త్రీలతో ఎలా ప్రవర్తించాలనే దానిపై అవగాహన కల్పించాలి. ఎలా గౌరవించాలనేది కూడా..” అంటూ రిప్లై ఇచ్చింది అనసూయ.

- Advertisement -