మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘకాలం తర్వాత వెండితెరపై ఖైదీనెంబర్ 150తో రికార్డ్ బద్దలు కొట్టాడు. దీంతో చిరు మ్యానియా మళ్ళీ మొదలైంది అంటూ మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈసంగతి ఇలా ఉంటే చిరంజీవికి హాట్ యాంకర్ అనసూయ షాక్ ఇచ్చింది ఎలా అని అనుకుంటున్నారా…..
చిరంజీవి ఖైదీ సక్సెస్ తర్వాత బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఇప్పటి వరకు మూడు వారాలు ప్రసారం అయిన ఈషోకి వస్తున్న రేటింగ్స్ మాత్రం అతంత మాత్రంగా ఉన్నాయి. చిరంజీవి ఈ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్నప్పటీకి రేటింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.
‘
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రసారం చేస్తున్న ‘స్టార్ మా’ యాజమాన్యం చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించడంతో ఏకంగా టీఆర్‌పీ రేటింగ్స్ పది వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిందట. అయితే ఈషోకు ఇప్పటి వరకు 5.80 రేటింగ్స్ మించి రాకపోవడమే కాకుండా వారం వారం గడుస్తున్న కొద్దీ ఈ షోకు మరింత రేటింగ్స్ తగ్గిపోతూ ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అసలు విషయం ఏంటంటే….చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో కన్నా యాంకర్ అనసూయ నిర్వహిస్తున్న ‘డేట్ విత్ అనసూయ’ కార్యక్రమానికి మంచి రేటింగ్స్ వస్తు ఉండటం అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారట. చిరు షోకు కన్నా హాట్ యాంకర్ అనసూయ షోనే ఎక్కువగా చూడటానికి బుల్లితెర ప్రేక్షకులు ఇంట్రస్ట్ చూపిస్తున్నారని మనకు ఇట్టే అర్థమైపోతుంది.
అయితే ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం మేరకు అనసూయ షోకు 6.5 రేటింగ్స్ రావడం షాకింగ్ న్యూస్ గా మారింది. దీనితో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సిరీస్ పట్ల బుల్లితెర ప్రేక్షకులలో క్రేజ్ తగ్గిందా ? లేదంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చిరంజీవి పట్ల క్రేజ్ తగ్గిందా ? అన్న విషయమైపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాదాపు 10 వారాలు కొనసాగే మెగాస్టార్ చిరంజీవి ‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో మూడవ వారం ముగిసే సమయానికే రివర్స్ గేర్ లోకి వెళ్ళిపోతున్న నేపధ్యంలో ఈ షోను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ‘స్టార్ మా’ సంస్థకు టెన్షన్ మొదలైంది అన్న వార్తలు ఫిల్మ్‌సర్కిల్‌లో వినిపిస్తున్నాయి.