మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా దర్శకుడు కొరటాల శివతో చేయనున్నాడు. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పూజా కార్యాక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం రెగ్యూలర్ షూటింగ్ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభంకానుంది. ఈమూవీలో చిరు సరసన త్రిషను తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా ఈమూవీలో యాంకర్ అనసూయను ఓ కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యమైన ఆ పాత్రకి అనసూయ అయితేనే బాగుంటుందని కొరటాల భావించడం .. ఆమెను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని చెప్పుకున్నారు. కానీ ఇప్పడు చిరు మూవీలో అనసూయను ఛాన్స్ లేదని చెప్పుకుంటున్నారు.
అనసూయ స్ధానంలో విజయశాంతిని తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటివలే సరిలేరు నీకెవ్వరు ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతిలు కలుసుకున్న సంగతి తెలిసిందే. విజయశాంతి చిరంజీవితో మనమిద్దరం కలిసి మరో సినిమా చేద్దామా అని అడగ్గా.. తప్పకుండా చేద్దాం అని చిరు చెప్పారు. దీంతో చిరు 152వ మూవీలో విజయశాంతిని పెడితే సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందని భావించారట చిత్రయూనిట్. దీంతో అనసూయ పాత్రలో విజయశాంతిని తీసుకున్నారని తెలుస్తుంది. ఈవిషయంపై అనసూయ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.