‘పుష్ప’ సెట్‌లో రంగమ్మత్త..!

105
Anasuya

స్టైలీష్‌స్టార్‌ అల్లు అర్జున్-సుకుమార్‌ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా పుష్ప‌. ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్అప్ డేట్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ మూవీలో అందాల భామ అన‌సూయ భ‌రద్వాజ్ కీలక పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం షూటింగ్ రీస్టార్ట్ అవ‌గా..తాజా షెడ్యూల్‌లో అన‌సూయ జాయిన్ అయింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.

ఎర్రచంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో పాన్ ఇండియా స్టోరీతో వ‌స్తున్నఈ మూవీ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. పుష్ప ప్రాజెక్టులో క‌న్న‌డ భామ‌ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా నటిస్తుంది.. మ‌ల‌యాళ స్టార్ స్టార్ హీరో ఫ‌హ‌ద్ ఫాసిల్ కీ రోల్ పోషిస్తున్నాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కాబోతుంది. రంగ‌స్థ‌లం లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సుకుమార్‌తో మ‌రోసారి ఈ సినిమా చేస్తుండ‌టం ఎక్జ‌యిటింగ్‌గా ఉంద‌ని తెలిపింది అన‌సూయ‌.

ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ వచ్చింది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలు పెట్టారు. తాజాగా ఈ రోజు షూటింగ్‌లో అనసూయ తిరిగి జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్లో అనసూయ, అల్లు అర్జున్, రష్మికలపై కొన్ని కీలక సన్నివేశాలను సుకుమార్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని ఈ యేడాది చివరల్లో విడుదల చేయనున్నారు.