ఆదితో ‘ఆర్ ఎక్స్ 100’ బ్యూటీ రొమాన్స్..

79
Payal Rajput

టాలీవుడ్‌ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో పాయల్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశలను అందిపుచ్చుకుంది. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోవడం వలన, అవి ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన ఆమె కాస్త వెనుకబడింది. అయినా సోషల్ మీడియా ద్వారా హాట్ ఫోటోలు వదులుతూ అభిమానులకు టచ్ లో ఉంటూ వచ్చింది. ఆది సాయికుమార్ జోడీగా ఆమె ‘కిరాతక’ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా, ఆగస్టు 13వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

తాజాగా పాయల్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ .. ” ఈ మధ్య కాలంలో నేను చాలా కథలు విన్నాను .. కానీ అవేవీ నాకు పెద్దగా నచ్చలేదు. దర్శకుడు వీరభద్రం గారు థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ కథను చెప్పారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అందుకే సింగిల్ సిట్టింగ్ లోనే నేను ఓకే చెప్పేశాను. ఈ సినిమా నా కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని అనిపిస్తోంది” అంటూ చెప్పుకొచ్చింది.