జబర్దస్త్‌కి అనసూయ గుడ్‌బై?

42
anasuya
- Advertisement -

బుల్లితెరపై టాప్ రేటింగ్ షో జబర్దస్త్. జబర్దస్త్ వల్ల ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి దొరికారు. అయితే కొంతకాలంగా ఒక్కోక్కరుగా జబర్దస్త్‌ను వీడుతుండగా తాజాగా జబర్దస్త్ కి యాంకర్ అనసూయ కూడా గుడ్‌బై చెప్పేసింది. ఇటీవల వరుసగా వేరే ఛానల్స్ ప్రోగ్రామ్స్ లో అనసూయ పాల్గొంటుంది. ఇప్పటివరకు షూట్ చేసి ఉన్న జబర్దస్త్ ఎపిసోడ్స్ లో అనసూయ కనిపిస్తుంది. ఆ తర్వాత అనసూయ కూడా జబర్దస్త్ లో కనపడదు.


దీనిపై ఇండైరెక్ట్ గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది అనసూయ. నా కెరీర్‌లో నేను చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చాలా మెమరీస్ తీసుకెళ్తున్నాను. అందులో ఎన్నో మధురక్షణాలతో పాటు, కొన్ని చేదు క్షణాలు కూడా ఉన్నాయి. ఇక ముందు కూడా ఎప్పటిలాగే మీ ఆదరణ నాకు ఉంటుందని భావిస్తున్నాను అని తెలిపింది.

గతంలో నాగబాబుతో పాటు ధనరాజ్, అదిరే అభి, కిరాక్ ఆర్పీ, అప్పారావు, వేణు, చమ్మక్ చంద్ర లాంటి కొంతమంది కమెడియన్స్ జబర్దస్త్ ని వీడారు. తర్వాత రోజాకి మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ ని వీడింది. ఆ తర్వాత హైపర్ ఆది కూడా వెళ్ళిపోయాడు. ఇక జబర్దస్త్ కి బాగా పేరు రావడానికి కారణం అయిన సుడిగాలి సుధీర్ కూడా ఇటీవల వేరే ఛానల్ కి వెళ్ళిపోయాడు.

- Advertisement -