- Advertisement -
యాంకర్‌గా బుల్లితెరపై నటిగా వెండితెరపై తన నటనతో మెప్పిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది నటి అనసూయ భరద్వాజ్. తెలుగు, తమిళంలో సెలక్టెడ్ పాత్రలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్న రంగమ్మత్త తాజాగా ఎయిర్ హోస్టెస్‌గా మారనుంది.
పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్. ఆయన ఓ ఆంథాలజీ మూవీని తెరకెక్కించనున్నాడు. ఇదీ 6 కథల సమ్మేళనం కాగా ప్రతి కథలో ఒక ప్రముఖ నటీనటులు లీడ్ రోల్లో కనిపించనున్నారు. ఇందులో భాగంగా అనసూయ కూడా ఓ కథలో లీడ్ రోల్ పోషించనుంది.
ఆగస్టు నుంచి ఈ సినిమా చిత్రీకరణలో అనసూయ జాయిన్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కృష్ణంవంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ , రవితేజ ఖిలాడి , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్‌ల పాన్ ఇండియన్ మూవీ పుష్పలలో నటిస్తోంది.
- Advertisement -