దివ్యాంగుడి టాలెంట్‌కి మంత్రి కేటీఆర్ ఫిదా

41
ktr minister

ఓ దివ్యాంగుడి ప్ర‌తిభ‌కు మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. త‌న‌కున్న లోపాల‌ను అధిగ‌మించి.. టైపింగ్‌లో అద్భుత‌మైన ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న ఆ దివ్యాంగుడిని ఆదుకోవాలంటూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్‌కు చెందిన జాకీర్ పాషా కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. త‌న‌కు రెండు చేతులు లేవు. ఎంకామ్ పూర్తి చేశాను. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉంది. త‌న‌కు ఒక ఉద్యోగం కావాలంటూ కేటీఆర్‌ను కోరాడు. ఈ ట్వీట్‌కు తాను కాళ్ల‌తో టైపింగ్ చేస్తున్న వీడియోను జ‌త చేశాడు. దివ్యాంగుడి ప్ర‌తిభ‌ను మెచ్చుకున్న కేటీఆర్.. అత‌నికి స‌హాయం చేయాలంటూ క‌లెక్ట‌ర్ రాహుల్ రాజ్‌కు ట్వీట్ చేశారు.