అవన్నీ గాలి వార్తలే…

452
rashmi
- Advertisement -

టీవీ యాంకరింగ్ కు గ్లామర్ ను తెచ్చేసిన వాళ్లలో అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి వాళ్లు ముందున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రియాలిటీ షోలు, కామెడీ షోలు అంటూ వీళ్లు హాట్ హాట్ కామెంట్స్ తో, అడల్ట్ జోకులతో, అందాల ప్రదర్శనతో అదరగొట్టేస్తున్నారు. వీళ్లకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ నే కలిగి ఉన్నారు. అంతే కాదు.. బుల్లితెరపై వీరు సంపాదించుకున్న పాపులారిటీని చూసి సినిమా అవకాశాలు వీళ్లను వెదుక్కొంటూ వస్తున్నాయి. వీళ్లను సినిమాల్లో నటింపజేయడానికి, వీరి చేత ఐటమ్ సాంగ్స్ చేయించడానికి టాలీవుడ్ మూవీ మేకర్లు ఉత్సాహంగా ఉన్నారు.

Rashmi

ముఖ్యంగా తెలుగు బుల్లితెరపై, వెండితెరపై అనసూయ, రష్మీలు  హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని ఫిజిక్ అండ్ అప్పియరెన్స్ తో ఆడియన్స్ మతులు పోగొట్టేసి జనాల్లో తెగ క్రేజ్ పెంచుకున్నారు. వీళ్లిద్దరికీ ఇంత పాపులారిటీ తెచ్చిపెట్టింది ఈటీవి లో ప్రసారమయ్యే జబర్దస్త్ అండ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాంలే. వీటిలో రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్ కు యాంకరింగ్ చేస్తుండగా.. అనసూయ జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయింది. ఈ కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశం ఆడియ‌న్స్‌ని క‌డుపుబ్బ న‌వ్వించ‌డ‌మే. ప్ర‌తి గురు, శుక్ర‌వారాల‌లో ప్ర‌సారం అవుతున్న ఈ కార్య‌క్ర‌మంలో టీమ్ లీడ‌ర్స్‌తో పాటు కో పార్టిసిపెంట్స్ కూడా త‌మ దైన స్టైల్‌లో వినోదాల విందు అందిస్తున్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మానికి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ నాగ బాబు, రోజా అయితే మ‌రో వైపు అన‌సూయ‌, ర‌ష్మీ అనే చెప్పాలి.

Rashmi

అయితే తాజాగా ఈ షోలకు సంబంధించి ఓ వార్త హల్‌ చల్‌ చేసింది. అదేంటంటే… ఈ షోలలో యాంకర్లుగా చేస్తున్న  రష్మీని  తప్పించి  ఆ ప్లేస్‌లో యాంకర్‌ హరితేజను తీసుకుంటారని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇదంతా ఉత్తిదేనని తెలుస్తోంది. బబర్ధస్త్‌ షో యాజమాన్యం ఈ విషయంపై ఓ క్లారిటి ఇచ్చినట్టు తెలుస్తోంది.  జ‌బ‌ర్ధ‌స్త్ నిర్మాత‌ల నుండి వ‌స్తున్న‌వార్త‌ల ప్ర‌కారం ర‌ష్మీ స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేయ‌డం లేద‌ని, మరి కొద్ది రోజులు ఈ అమ్మ‌డే ఎక్స్ ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

- Advertisement -