‘పొట్టేల్’ …అనన్య నాగళ్ల బర్త్ డే స్పెషల్

6
- Advertisement -

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న’పొట్టేల్’ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ మూవీ. ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలోని ఇప్పటిదాకా విడుదలైన 4 పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి.

అనన్య నాగళ్ల బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అనన్య రూరల్ ట్రెడిషనల్ లుక్ లో చాలా నేచురల్ గా కనిపించారు. ఇందులో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. బుజ్జమ్మగా అనన్య క్యారెక్టర్ ఎక్స్ ట్రార్డినరీగా వుండబోతోంది.

ఈ మూవీలో అజయ్ ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ టెర్రిఫిక్ గా ఉండబోతోంది. ఈ చిత్రాన్ని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మోనిష్ భూపతి రాజు, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్షన్ నార్ని శ్రీనివాస్.త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read:జర్నీ ఆఫ్ ‘విశ్వం’..అదిరే రెస్పాన్స్

- Advertisement -