తక్కువ ధరకు బంగారు నాణేలను ఇస్తామని మాయమాటలతో వల వేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా ను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు జల్సాలకు పాల్పడుతూ సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ట్లు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి చెప్పారు. చీటింగ్ ముఠా కు సంబంధించిన వివరాలను డిఎస్పి వెల్లడించారు.
నకిలీ బంగారు నాణేలతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా నుంచి 10 లక్షల నగదు, కారు, బైకు,మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మచే హల్లి,గొరచర హాట్టి, హర్పన హల్లికి చెందిన వారు.నిందితులు నల్లగొండ జిల్లా బాజకుంట గ్రామానికి చెందిన పరమేష్,మహేష్ లకు బంగారు నాన్నలు తక్కువ ధరకు ఇస్తామని మోసగించారు. నకిలీవని బాధితులు ప్రశ్నించడంతో నగదు ఎత్తుకెళ్లి నిందితులు పరారయ్యారు అని అనంతపురం డీఎస్పీ ప్రసాద్ రెడ్డి అన్నారు. రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి ,ఎస్.ఐ మహానంది, నబి రసూల్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.