- Advertisement -
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అనంత్ ఎంగేజ్‌మెంట్ వీరేన్ మర్చంట్ – శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో గురువారం ఘనంగా జరిగింది.
రాజస్థాన్‌లో శ్రీనాథ్‌జీ ఆలయంలో ఎంగేజ్‌మెంట్ జరుగగా ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అనంత్ – రాధిక చాలా సంవత్సరాలుగా రిలేషన్ షిప్‌లో ఉండగా అంబానీ కుటుంబం హోస్ట్ చేసే అన్ని ఈవెంట్‌లలో రాధిక కనిపిస్తుంది.
రాధిక ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవోగా ఉన్నారు. రాధిక ముంబైలో చదువుకున్నారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయాలు, ఆర్థికశాస్త్రంలో డిగ్రీచేసింది. ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్స్ డ్యాన్స్ అకాడమీకి చెందిన గురు భవన్ థాకర్ వద్ద శిక్షణ పొందారు రాధిక.
ఇవి కూడా చదవండి..
- Advertisement -