పెళ్లిపీటలు ఎక్కబోతున్న యంత్రలోకపు సుందరి

236
amy jackson
- Advertisement -

రజనీ 2.0తో అలరించిన అందాల భామ అమి జాక్సన్‌. ఎవడు,అభినేత్రి చిత్రాల్లో మెప్పించిన ఈ బ్యూటీ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది.ఈ విషయాన్ని స్వయంగా అమీనే వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన వ్యాపార వేత్త జార్జ్‌ పనయటోను పెళ్లిచేసుకోనుంది.

కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట నిశ్చితార్థం నూతన సంవత్సరం రోజున జరిగింది. ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌తో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసిఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. కొత్త సంవత్సరం వేళ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

జనవరి 1న జాంబియాలో వీరి ఎంగేజ్మెంట్ జరగగా..ఈ ప్రపంచంలో అందరికంటే నన్ను హ్యాపీయెస్ట్‌గా చూడగలిగే వ్యక్తితో కలిసి కొత్త ప్రయాణం మొదలైంది…. లైఫ్‌లో ఇదో హ్యాపీ అడ్వంచర్’ అని తెలిపింది అమి జాక్సన్.

జార్ట్ పనాయొటో మల్టీ మిలియనీర్ ప్లే బోయ్‌గా ప్రసిద్ధి. యూకేలోనే అత్యంత ధనవంతుడు. బ్రిటీష్ ప్రాపర్టీ డవలపర్ ఆడ్రియాస్ కుమారుడే ఈ జార్ట్ పనాయొటో. వీరికి ప్రపంచ వ్యాప్తంగా ఖరీదైన హోటల్స్ ఉన్నాయి.

amy jackson

- Advertisement -