బాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ అమ్మ అయింది. జార్జి పనయొట్టుతో అమీ జాక్సన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి నిశ్చితార్థం కూడా అయింది. కానీ ఇంకా పెళ్లి కాలేదు ఈ క్రమంలో అమీ గర్భందాల్చిన విషయం తెలిసిందే. బ్రిటన్ కాలమానం ప్రకారం అమీ జాక్సన్ ఆదివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డకు ఆండ్రియాస్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని అమీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ తన కుమారుడు, భర్తతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
అయితే ఇందులో విశేషమేమే లేకున్నా.. అమ్మగా అమీ చేసిన వినూత్న ప్రయత్నం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. తల్లీపాలు బిడ్డకు ఎంత ముఖ్యమో చెప్పడానికి అమీ జాక్సన్ తన కొడుక్కి పాలిస్తూ దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రసవించిన వెంటనే బిడ్డకు పాలిస్తూ.. తల్లీపాల ఆవశ్యకతను చాటుతూ పెట్టిన ఫొటోపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
‘యాండ్రియాస్.. మా ఏంజెల్. ఈ ప్రపంచానికి స్వాగతం’ అని క్యాప్షన్ చేస్తూ పాపతో దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. ‘ఎవడు, ఐ, 2.0’ సినిమాల్లో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించింది.
https://www.instagram.com/p/B2wCaALpayw/