‘అమూల్ హగ్స్ బ్రెడ్ డైలీ’.. అమూల్ సెటైర్లు..

207
rahul gandhi

బీజేపీ ప్రభుత్వంపై టీడీపీ ప్రేవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. అయితే నిన్న సభలో అవిశ్వాసం చర్చ సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం ముగిసిన తరువాత చేసిన రభస అందరికి తెలిసిందే. ప్రధాని మోడీని కౌగిలించుకోవడం, అనంతరం తమ పార్టీ సభ్యులకు కన్నుకొట్టడం సభలో నవ్వులు పూయించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో రాహుల్, మోడీపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. రాహుల్ కన్నుకొట్టడాన్ని సోషల్ మీడియా క్వీన్ ప్రియావారియర్ తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు.

amool

తాజాగా గుజరాత్ కి చెందిన అమూల్ కో-ఆపరేటివ్ డెయిరీ కూడా ఈ ఘటనను తన వ్యాపారానికి ఉపయోగించుకుంది. ఈ ఘటనపై ఓ వ్యంగ్ర చిత్రాన్ని రూపొందించింది. ఇందులో కుర్చీలో కూర్చొని ఉన్న ప్రధాని మోడీని రాహుల్ గాంధీ హగ్ చేసుకుంటూ కన్నుకొట్టడం చూడవచ్చు. కౌగిలించుకుంటున్నారా..? లేక ఇబ్బంది పెడుతున్నారా..? అంటూ క్యాప్షన్ తో పాటు అమూల్ హగ్స్ బ్రెడ్ అని  కామెంట్ చేసింది. ఈ చిత్రాన్ని అమూల్ సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా.. నెటిజన్లు తమ దైన శైలిలో స్పందిస్తున్నారు. 

నిన్న లోక్ సభలో జరిగిన చాలా పెద్ద నాటకాన్ని చూడలేక పోయానే, సభలో కౌగిలింతలు, కన్నుకొట్టడాలు, నేతల స్పీచ్ లు మిస్సయ్యానే అంటూ కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. మొత్తానికి రాహుల్ కన్నుకొట్టడం సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతోంది.