- Advertisement -
మిర్యాలగూడలో గతేడాది ప్రణయ్ అనే వ్యక్తి పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈసంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రణయ్ హత్యకు కారకుడైన అమృత తండ్రి మారుతీరావు ప్రస్తుతం జైలు లో శిక్ష అనుభవిస్తున్నాడు. అమృత తక్కువ కులం అతడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో అతన్ని నడి రోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు మారుతీరావు.
ప్రణయ్ చనిపోయేనాటికి అమృత 5నెలల గర్భిణి. తాజాగా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డలు ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు వైద్యులు. ప్రస్తుతం ప్రణయ్ కుటుంబ సభ్యులకు పోలీసుల భద్రత కలిపిస్తున్నారు. మళ్లీ ప్రణయే తమ ఇంట పుట్టాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -