‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ ప్రారంభం

243
isamrt shankar
- Advertisement -

ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేష‌న్ లో రానున్న ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం షూటింగ్ నేడు ప్రారంభమయ్యింది..’డబుల్ ధమాకా దిమాక్ ‘ అనే క్యాప్షన్ తో సినిమా వస్తుండగా సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో రామ్ ఈ సినిమా లో కనిపించనున్నారు. కాస్ట్యూమ్స్ కూడా రామ్ పాత్ర కు తగినవిధంగా వైవిధ్యంగా ఉండడం విశేషం.. ఈ లాంగ్ షెడ్యూల్ లో హీరో రామ్ పై పలు ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

ismart Shankar

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు..పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

నటీనటులు : రామ్ పోతినేని, పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి..

సాంకేతిక నిపుణులు : దర్శకుడు: పూరి జగన్నాధ్, నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, సమర్పణ: లావణ్య, బ్యానర్లు: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ఆర్ట్ డైరెక్టర్ : జానీ షైక్, ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి , పాటల రచయిత: భాస్కరభట్ల, ఫైట్స్ : రియల్ సతీష్

- Advertisement -